సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇంటి అలంకరణ కోసం ఇంటి ఆవరణంలో ఎన్నో రకాల మొక్కలను పెంచుతూ ఉంటారు.ఈ క్రమంలోనే కొన్ని రకాల మొక్కలను దైవ సమానంగా భావించి అలాంటి మొక్కలను ఇంటి ఆవరణంలో నాటుతూ ఉంటారు. అయితే ఇలా దైవ సమానంగా భావించే కొన్ని మొక్కలను ఎప్పుడూ కూడా సరైన దిశలో నాటడం వల్ల ఎంతో మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా దైవ సమానంగా భావించే మొక్కలలో పారిజాతం మొక్కలు ఒకటి. పారిజాత పుష్పాలను పూజకు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు.
పారిజాత పుష్పాలతో లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై కురిపిస్తారని భావిస్తారు. అందుకే చాలామంది పారిజాతం మొక్కలను ఇంటి ఆవరణంలో పెంచుతుంటారు. ఇక ఈ పారిజాత పుష్పాల నుంచి వెదజల్లే సువాసనలు ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి.అయితే పారిజాత పుష్పాన్ని వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణంలో ఏ దిశలో నాటాలి అనే విషయాన్ని వస్తే..
వాస్తు శాస్త్రం ప్రకారం పారిజాత పుష్పాలను తూర్పు లేదాఉత్తర దిశలో నాటాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఈ దిశలో ఈ వృక్షాన్ని నాటడం ఎంతో మంచిది. అయితే ఈ పారిజాత వృక్షాన్ని నాటిన తర్వాత చెట్టు కింద ఎప్పుడు కూడా పేడతో కల్లాపి చల్లి ఉండాలి. అలాగే ఈ చెట్టు నుంచి నేలకు రాలిన పుష్పాలను సేకరించి స్వామివారికి పూజలు చేయాలి. ఇలా నేలరాలిన పుష్పాలతో పూజ చేయడం ఎంతో మంచిది. ఈ పారిజాత వృక్షం కేవలం ఆధ్యాత్మికపరంగా మాత్రమే కాకుండా ఆయుర్వేదంగా కూడా ఎంతో ముఖ్యమైనది.