ఈ ట్రైలర్ తెగ చూస్తున్నారు..

హాలీవుడ్ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు హెల్ బాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఎర్రగా ఉంటూ .. చేతిలో గన్‌.. నోట్లో సిగార్‌ పెట్టుకుని కత్తిరించిన కొమ్ములు గల తలతో చూడగానే ఇట్టే మనని తనవైపుకు తిప్పేసుకుంటాడు. హెల్‌బాయ్‌ పాత్ర ఇప్పటికే రెండు సార్లు హాలీవుడ్‌ లో తెరకెక్కి, అక్కడ జనాలను అలరించింది. ఇప్పుడు హెల్‌బాయ్‌ మరోసారి రచ్చ చేసేందుకు వస్తున్నాడు. హెల్ బాయ్ రీబూట్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను టీమ్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. మీరూ ఓ లుక్కేయవచ్చు.

Hellboy (2019 Movie) Official Trailer “Smash Things” – David Harbour, Milla Jovovich, Ian McShane

మానవజాతి మొత్తాన్ని నాశనం చేసి, తనదైన ప్రపంచాన్ని సృష్టించుకోవాలని ఆశపడే దుష్టశక్తులను హెల్‌బాయ్‌ ఎదుర్కొని, ఎలా బుద్ది చెప్పాడనేదే ఈ చిత్ర కథ.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న తాజా చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 12న ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ చిత్రానికి నెయిల్‌మార్షల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డేవిడ్‌ హార్బర్‌, మిల్లా జవోవిచ్‌, ఇయాన్‌ మెక్‌షానే, షషాలేన్‌, డేనియల్‌ డేకిమ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లయన్స్‌గేట్‌, మిలియన్‌ ఫిల్మ్స్‌, క్యాంప్‌బెల్‌ గ్రాబ్‌మెన్‌ ఫిల్మ్స్‌, డార్క్‌ హార్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాంకపై లారెన్స్‌ గోర్డాన్‌, లాయిడ్‌ లెవిన్‌, మైక్‌ రిచర్డ్‌సన్‌లు నిర్మిస్తున్నారు.

ఇక హెల్ బాయ్ పాత్ర విషయానికి వస్తే.. డార్క్‌ హార్స్‌ కామిక్స్‌ పాత్రల్లో ఒకటి. 1993లో విడుదలైన డార్క్‌ హార్స్‌ కామిక్స్‌ విశేష ప్రజాదరణ చూరగొంది. వెంటనే ఈ కామిక్స్‌పై హాలీవుడ్‌ దృష్టి పడటంతో గతంలో హెల్‌బాయ్‌(2004), హెల్‌బాయ్‌ 2: ది గోల్డెన్‌ ఆర్మీ(2008) చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు వస్తోన్నది మూడో చిత్రం.