హీరోయిన్ ని మొసలి నీళ్లలోకి లాగేస్తూంటే…

జంతువులపై సినిమాలు చేయటం హాలీవుడ్ కుసరదా…సంతోషమూను. ఎందుకంటే జంతువులతో చేసిన సినిమాలన్నీ హిట్ అవుతూ రికార్డ్ లు బ్రద్దలు కొడుతూ వస్తున్నాయి. రాక్షస బల్లులతో తెరకెక్కించినా, చీమలతో పెద్ద సినిమా చేసినా కలెక్షన్స్ తో భాక్సాఫీస్ చెలరేగిపోతూంటూంది. ఆ ప్రేరణతోనే ఇప్పుడు తాజాగా మరో చిత్రం ప్రేక్షకులకు అలరించడానికి రెడీఅవుతోంది. అలెగ్జాండ్రి అజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాల్‌’. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేస్తే..రికార్డ్ ల బ్రద్దలు కొట్టే వ్యూస్ తో దూసుకుపోతూ వ్యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

Crawl (2019) – Official Trailer – Paramount Pictures

ఈ ట్రైలర్ లో స్టోరీ లైన్ చెప్పేసారు. అమెరికా లోని ఫ్లొరిడా రాష్ట్రాన్ని హరికేన్‌లు చుట్టుముడతాయి. వర్షాలు, వరదలతో ఆ ప్రాంతమంతా నీట మునుగుతుంది. దీంతో అక్కడి ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతారు. ఓ మహిళ మాత్రం ఇంట్లో ఉండిపోతుంది.

ఈ నేపథ్యంలో వరదల ధాటికి అక్కడకు కొట్టుకు వచ్చిన మొసళ్ల నుంచి ఆమె ఎలా ప్రాణాలను దక్కించుకుంది? ఆమెను కాపాడటానికి వచ్చి బలైపోయిన వారు ఎవరు? తదితర అంశాలతో ఈ సినిమా ఎంతో ఉత్కంఠగా తెరకెక్కించారు. పారామౌంట్‌ పిక్చర్స్‌ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని క్రెయిగ్‌ జె ఫ్లోరిస్‌, శామ్‌ రైమీలు నిర్మించారు. జులై 12 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.