చిన్నప్పుడే నాపై అత్యాచారం జరిగింది
కొన్ని జీవితాలు పైకి కనిపించినంత అందంగా ఉండవు. వారి నిజ జీవిత కథలు వింటూంటే జాలి వేస్తుంది. అయ్యో అనకుండా ఉండలేం. ప్రముఖ హాలివుడ్ స్టార్ డెమీ మోర్ గురించిన జీవిత విశేషాలు విన్నా అంతే …ఆమెపేరు వినగానే ‘ఇండీసెంట్ ప్రపోజల్’ పేరు గుర్తుకు రాక తప్పదు. ఏమాత్రం సంకోచం లేకుండా రొమాంటిక్ చిత్రాల్లో నటించిన డెమీ మోర్ జీవితం అల్లకల్లోలంగా నడిచింది. ఆమెపై 15వ ఏటనే అత్యాచారం జరిగిందట. ఈ విషయాన్ని ఆమే తెలియచేసింది.
ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ డెమీ మోర్…అప్పుడు ఆమె లాస్ ఏంజెలిస్‌లోని ఫెయిర్ ఫాక్స్ హై స్కూల్లో చదువుకుంటున్నప్పుడు జరిగింది. అయితే ఆ విషయం చెప్పటానికి నేనేమీ సిగ్గుపడటం లేదు. నాకు ఏం జరుగుతోందో తెలిసే లోగా నేను రేప్ కు గురి అవ్వటం జరిగింది.
నా 16వ ఏటనే ఓ గిటారిస్ట్‌తో సహ జీవనం చేసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేశా. ఆ తర్వాత రెండేళ్లకు గిటారిస్ట్‌ను వదిలేసి రాక్ మ్యుజీషియన్ ఫ్రెడ్డీ మోర్‌ను ప్రేమించా. అప్పుడే ‘జనరల్ హాస్పటల్’, ‘లాస్ట్ నైట్’ లాంటి హాలివుడ్ చిత్రాల్లో నటించే అవకాశం రావడం, వాటి ద్వారా పేరు రావడంతో మద్యానికి, కొకైన్‌కు బానిస అయ్యా అంటూ చెప్పుకొచ్చింది.
అలాగే 2004లో బాయ్‌ఫ్రెండ్ ఆష్టన్ కుచర్‌తో ప్రేమాయణంలో గర్భవతి అయ్యా. కడుపులోని బిడ్డకు ఆరు నెలలు నిండగానే గర్భస్రావం అయింది. దాంతో ఆమె మద్యానికి, డ్రగ్స్‌కు మరోసారి అలవాటు పడ్డా. 2005లో భాయ్ ఫ్రెండ్ ఆష్టన్ కుచర్‌ను పెళ్లి చేసుకొని వైద్య చికిత్సల ద్వారా తల్లి అయ్యేందుకు ప్రయత్నించా. అయినా లాభం లేకపోవడంతో ఆ ప్రయత్నాలను విరమించిందట.
ఈ విషయాలన్నీ స్వయంగా డెమీ మోర్ ‘ఇన్‌సైడ్ అవుట్’ అనే ఆత్మ కథ ద్వారా ప్రపంచానికి చెప్తోంది. ఆ పుస్తకం ఈనెల 24వ తేదీన మార్కెట్లోకి వస్తోంది. ఆమె జీవితంలో వివాదాస్పదమైన అనేక అంశాలు ఈ పుస్తకంలో ఉండే అవకాశం ఉంది.