ఎర్ర కలబంద గుజ్జుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

సహజంగా దాదాపు అందరి ఇంటి పెరట్లో కలబంద మొక్క కచ్చితంగా ఉంటుంది. కలబంద గుజ్జులో ఉన్న పోషకాలు, ఔషధ గుణాలు మన శరీరంలోని వ్యాధికారకాలను తొలగించడంలో అద్భుత ఔషధంగా పనిచేస్తా. సహజంగా కలబంద మొక్క ఆకుపచ్చ రంగులో ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలుసు. ఇటీవలే బాగా ప్రాచుర్యం పొందిన ఎరుపు రంగు కలబంద మొక్కలో ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు మన ఆరోగ్యాన్ని ,సౌందర్యాన్ని రక్షించడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆ వివరాలంటే ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకుపచ్చ కలబంద గుజ్జులో కంటే మిన్నగా ఎరుపు రంగు కలబంద మొక్క గుజ్జులో మన శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ , యాంటీ ఆక్సిడెంట్,అమినోయాసిడ్స్ ,యాంటీ బ్యాక్టీరియల్, మరియు పాలీశాకరైడ్లు సమృద్దిగా లభిస్తాయి కావున ప్రతిరోజు కలబంద గుజ్జును జ్యూస్ రూపంలో సేవిస్తే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొంది సీజనల్ గా వచ్చే అన్ని రకాల వ్యాధులను తరిమికొడుతుంది.

కలబంద గుజ్జులో ఉన్న ఔషధ గుణాలు మన శరీరంలోని కొలెస్ట్రాల్ని తగ్గించి ఉబకాయం, అధిక రక్తపోటు, గుండె జబ్బు వంటి వ్యాధులను రాకుండా ఆపుతుంది. కలబంద గుజ్జులో పుష్కలంగా ఉన్న ఫైబర్ రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్తహీనత సమస్యను కూడా దూరం చేస్తుంది.

ఎర్ర కలబంద గుజ్జులో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉండడం వల్ల కలబంద గుజ్జును మన చర్మం పై మర్దన చేసుకుంటే మృత కణాలు తొలగి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. కలబంద గుజ్జుని ఫేస్ ప్యాక్ గా వేసుకుంటే హానికర బ్యాక్టీరియాని తొలగించి ముఖంపై నల్ల మచ్చలను, మొటిమలను తగ్గిస్తుంది.కలబంద గుజ్జుతో కొబ్బరి నూనెను కలిపి తల వెంట్రుకలపై మర్దన చేసుకుంటే చుండ్రు సమస్య,జుట్టు రాలడం వంటి సమస్యలు తొలగిపోయి అందమైన ఒత్తయిన కురులు మీ సొంతమవుతాయి.