వేసవి సీజన్లో మాత్రమే లభించే తాటి ముంజలు అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.వీటిని ఇంగ్లీషులో ఐస్ యాపిల్స్ అని కూడా అంటారు.
తాటి ముంజలు అద్భుతమైన రుచితో పాటు మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా అందించడంలో కీలక పాత్ర వహిస్తాయి. మృదువుగా ముట్టుకుంటే జారిపోయేంత సున్నింతగా ఉండే ఈ ముంజలను అలా నోట్లో పెట్టుకుంటే చాలు చల్లగా కడుపులోకి జారుకుంటాయి. అందుకే వేసవి తాపం వల్ల వచ్చే డీ హైడ్రేషన్, అలసట, నీరసం వంటి లక్షణాలను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
ఈ వేసవి కాలంలో ప్రతిరోజు తాటి ముంజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.తాటి ముంజల్లో అన్ని రకాల విటమిన్స్ తో పాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం,నియాసిస్,రిబో ప్లెవీస్, దయామిన్ పుష్కలంగా లభిస్తాయి. కావున మనలో ఇమ్యూనిటీ శక్తి పెంపొందుతుంది.ఒక్క తాటి ముంజలో ఆరు అరటిపండ్లలో ఉండే పొటాషియం ఉంటుంది కావున రక్తప్రసరణ లోపాలను సవరించి హై బీపీ , లో బిపి సమస్యలను నివారిస్తుంది.
ముఖ్యంగా తాటి ముంజుల మధ్యలో స్వచ్ఛమైన, రుచికరమైన నీరు ఉంటుంది.ఆ నీరు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఎండల్లో దాహార్తిని తీరుస్తాయి. వడదెబ్బ తగిలినవాళ్లకు ముంజులను జ్యూస్‌గా చేసి తాగిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. లేత తాటిముంజెలు పైన ఉన్న తొక్కను తొలగించకుండా తినేయండి అందులో ఉన్న ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణ సమస్యలను తొలగించడంలో దివ్య ఔషధంలా పనిచేస్తుంది
తాటి ముంజలు వేసవిలో వచ్చే చర్మ సమస్యలను నివారిస్తుంది. దద్దుర్లు, కాలిన గాయాలు, చేమట కాయలు ఏర్పడినట్లతే తాటి ముంజుల గుజ్జుని శరీరానికి పట్టించి చూడండి. మంచి ఫలితాలు లభిస్తాయి.తాటి ముంజల్లో క్యాల్షియం , ఐరన్ ఫాస్పరస్ వంటి మూలకాలు అధికంగా ఉంటాయి. కావున కీళ్ల నొప్పులు కీళ్ల వాపు సమస్యలను కూడా తగ్గిస్తాయి.