రోజూ పావుగంట ఎండలో నిలబడితే ఇన్ని లాభాలా.. బెనిఫిట్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

మన శరీరానికి ఎంతో ముఖ్యమైన విటమిన్లలో విటమిన్ డి ఒకటి. ప్రతిరోజూ ఎండలో నిలబడటం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ డి పొందవచ్చు. కేవలం 15 నిమిషాల పాటు ఎండలో నిలబడటం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఎముకల ధృఢత్వానికి, శరీరం కాల్షియం గ్రహించడానికి విటమిన్ డి ఎంతో ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.

విటమిన్ డి లోపం వల్ల కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నారు. కండరాలు, నాడుల పనితీరును విటమిన్ డి మెరుగుపరుస్తుందని చెప్పవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇళ్లు, ఆఫీసులకు పరిమితం అయ్యే వాళ్లలో చాలామంది విటమి డి లోపం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. శారీరక శ్రమ లేకపోయినా ఒళ్లంతా నొప్పులుగా, నీరసంగా ఉందంటే విటమిన్ డి లోపం ఉందని చెప్పవచ్చు.

విటమిన్ డి లోపంతో బాధ పడేవాళ్లను ఒస్టియోపోరోసిస్ వ్యాధి వేధించే ఛాన్స్ ఉంటుంది. ఈ వ్యాధి బారిన పడితే ఎముకలు బోలుగా మారి త్వరగా విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ముదురు మేని ఛాయ ఉన్న వారి శరీరంలో విటమిన్ డీ తక్కువగా తయారవుతుంది. నెలకోసారి విటమిన్ డీ సప్లిమెంట్లు తీసుకుంటే ఎముకల దృఢత్వానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.

ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య కాలంలో ఎండలో నిలబడటం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. స్లీవ్ లెస్ డ్రెస్‌ షార్ట్స్ వేసుకుని ఎండలో నిలబడితే మంచిదని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు.