బరువు తగ్గాలా అయితే ఇలా చేయండి?

weight-loss-tips

weight-loss-tips

చాలా మంది బ‌య‌ట ఫుడ్‌కి అలావాడు ప‌డి మ‌నం తీసుకునే ఆహారంలో నాణ్య‌త లేక‌పోవ‌డం వ‌ల్ల ఒళ్ళు రావ‌డం జ‌రుగుతుంది. అది చాలా మంది గ‌మ‌నించుకోవ‌డం లేదు. కేవ‌లం రుచికి స‌ర‌దాకి మాత్ర‌మే ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. బ‌య‌ట వండే ఆహారాల్లో అతిగా నూనెను వంట‌ల్లో వాడ‌టం కొవ్వు శాతం ఎక్కువ‌గా పెర‌గ‌డం వ‌ల్ల చాలా మందికి చిన్న వ‌య‌సులోనే లావుగా అయిపోతున్నారు. ఇక రెస్టారెంట్లు, మెక్ డొనాల్డ్ లాంటివి పెరిగిపోయాయి. ఆధునిక జీవన శైలి వలన మనకు తెలియకుండానే బరువు పెరుగుతున్నాము. కూర్చొని పని చేసే ప్రతి ఉద్యోగి, వ్యాపారి కూడా తన బరువు మీద కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా 35 దాటిన వాళ్ళు తమ బరువు మీద నియంత్రణ కలిగి ఉండాలి. బరువు పెరగటం వల్ల పొట్ట వద్ద, తొడల దగ్గర కొవ్వు పేరుకొని, గడ్దం క్రింద చర్మం వేలాడుతూ అసహ్యంగా తయారు అవుతాము. చర్మం కూడా బాగా సాగుతుంది. ఒక్క కేజీ బరువు పెరగటానికి ఎంతో సమయం పట్టదు. కానీ అదే ఒక్క కేజీ బరువు తగ్గటానికి వ్యాయామశాలకు వెళ్ళి, రోజు అర గంట పరుగెత్తి, కడుపును పస్తులు పెట్టి నానా అవస్థలు పడాలి. ఇన్ని అవస్థలు మనకు అవసరమా!! కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా మనము బరువు చూసుకొంటూ ఉండాలి.

స్థూలకాయస్తులా కాదా అనడానికి ఒక చిన్న లెక్క ఉంది. మన చేతి ఎముకలు సన్నవా, లావువా అని చూసి ఒక +/-5kgలు అటూ ఇటూ సర్దుకోవచ్చు. దాని దాటితే స్థూలకాయస్తుల జాబితాలో చేరినట్టే. దీన్ని జయించాలంటే, రోజు వారిలో మనం కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. అంతే కాక మనస్సు రక రకాల రుచుల మీదకు పోకుండా నియంత్రించుకోవాలి. వాటి కోసం కొన్ని చిన్న చొట్కాలను త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి. ఉద‌యాన్నే లేవ‌గానే బ్ర‌ష్ చేసుకున్నాక వేడి నీళ్ళు తాగాలి. అలాగే రాత్రి పూట అన్నం బ‌దులు చ‌పాతీ లేదా ఇడ్లీ వంటి ఆహారాన్ని తీసుకోవాలి. అదే విధంగా నాన్ వెజ్‌ని ఎంత త‌గ్గిస్తే అంత మంచిది. ఇక ఆకుకూర‌లు బాగా తినాలి. అలాగే ర‌సం లాంటివి కూడా ఎక్కువ‌గా తినాలి.