శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధుల ముప్పు నుంచి బయటపడే మార్గాలివే?

శీతాకాలం వచ్చిందంటే ఆస్తమా,సైనుసైటిస్‌, బ్రాంకై టిస్‌,న్యుమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు శ్వాసనాళాల్లో వాపు ఏర్పడి తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు. దానికి తోడు కరోనా వైరస్ ప్రాణాంతకంగా మారడంతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నాయి.వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారుతరచూ జలుబు,దగ్గు, గొంతు నొప్పి మొదలైన సమస్యలతో బాధపడుతుంటారు.
ఈ సమస్యలు దీర్ఘకాలం పాటు కొనసాగితే భవిష్యత్తు
సైనుసైటిస్‌, బ్రాంకై టిస్‌, న్యుమోనియా,ఫారింజైటిస్‌, టాన్సిలైటిస్‌ వంటి ప్రమాదకర శ్వాసకోశ వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది.

శ్వాసకోశ వ్యాధులకు ఆయుర్వేద వైద్యంలో చక్కటి పరిష్కార మార్గం చూపబడింది. పల్లెల్లో విరివిరిగా లభించే జిల్లేడు మొగ్గలను సేకరించి వాటిని కషాయంగా చేసి అందులో తాటి బెల్లం కలిపి వరుసగా ఏడు రోజులు వాడితే సాధారణ దగ్గు జలుబు తో పాటు ఆస్తమా, బ్రాంకైటిస్,న్యుమోనియా వంటి శ్వాస కోశ వ్యాధులకు కూడా చక్కటి పరిష్కారం లభిస్తుంది.

ఎన్నో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్న సర్పాక్షి వేరును చూర్ణం చేసి అల్లం రసంలో కలిపి తీసుకుంటే క్రమంగా దగ్గు, తుమ్ములు వంటి అలర్జీలను తొలగించుకోవచ్చు
ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం తేనె కలుపుకొని సేవిస్తే ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు శరీరం ఫ్రీ రాడికల్స్ ను తొలగించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

యాంటీ బ్యాక్టీరియల్, వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్న మిరియాలను కషాయంగా చేసి అందులో తేనె కలుపుకుని ప్రతిరోజు సేవిస్తే శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి త్వరగా విముక్తి లభిస్తుంది.యాంటీ అలెర్జిటిక్ లక్షణాలు ఉన్న అల్లం రసంతో తేనెను కలుపుకొని సేవిస్తే గొంతు నొప్పి ,జలుబు వంటి శ్వాసకోశ వ్యాధులను అదుపు చేయవచ్చు.

శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు భుజంగాసనం, ప్రాణాయామం, శ్వాస మీద ధ్యాస వంటి ఆసనాలను వేయడం ప్రతిరోజు అలవాటు చేసుకుంటే ఊపిరితిత్తులు వ్యాకోచం చెంది శ్వాస బాగా ఆడటం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులను నిరోధించవచ్చు.