నిమ్మకాయను ప్రతిరోజు మన ఆహారంలో ఏదో ఒక రకంగా తీసుకుంటూనే ఉంటాం. ముఖ్యంగా నిమ్మరసాన్ని, లెమన్ టీ నీ ప్రతిరోజు ఉదయాన్నే సేవిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చును అన్న విషయం మనందరికీ తెలిసిందే. నిమ్మ ఊరగాయ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు విషయం ఏమిటంటే నిమ్మకాయను కట్ చేసి రసాన్ని తీస్తున్నప్పుడు నిమ్మ గింజలను తీసి పక్కన పడేస్తుంటాం. అయితే నిమ్మ గింజల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
నిమ్మ విత్తనాల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం. నిమ్మ విత్తనాలు రుచికి చాలా చేదుగా ఉండి యాంటీ మైక్రోబియల్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండడం వల్ల మన ఆరోగ్యాన్ని రక్షించడంలో ఎంతగానో తోడ్పడతాయి. నిమ్మ విత్తనాలను నీటిలో బాగా మరిగించి వచ్చిన కషాయాన్ని సేవిస్తే పేగుల్లో పేరుకుపోయిన చెడు వ్యర్ధాలన్నీ విసర్జించబడి జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణాశయ క్యాన్సర్లు కూడా తొలగిపోతాయి. ఈ కషాయాన్ని తరచు తాగుతూ ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. గోరుచుట్టు సమస్య ఉన్నవారు నిమ్మ విత్తనాల పేస్టును రాసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారు నిమ్మ విత్తనాలను దోరగా వేయించి తింటే నొప్పి,వాపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్న నిమ్మ విత్తనాలను మెత్తటి చూర్ణంగా చేసి మొటిమలు, మచ్చలు ఉన్న ప్రదేశంలో లేపనంగా రాసుకుంటే మొటిమలు మచ్చలు తగ్గి చర్మ ఆరోగ్యం పెంపొందుతుంది. వ్యాధి నిరోధక శక్తి, జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు నిమ్మ విత్తనాల పొడిని ప్రతిరోజు నీటిలో కలుపుకొని సేవిస్తే జీర్ణ, శ్వాస సమస్యలు తొలగిపోవడమే కాకుండా వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది. చర్మంపై వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను అదుపు చేయడానికి నెమ్మ విత్తనాల పేస్టును ఉపయోగించవచ్చు.