నిద్రలేని సమస్యను ఎదుర్కోవడానికి కృత్రిమ హార్మోన్స్ వినియోగిస్తున్నారా? దానికి బదులు ఇలా చేయండి!

sleeping

మన సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతిరోజు తప్పనిసరిగా ఎనిమిది గంటల నిద్ర అవసరం అలాకాకుండా నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే భవిష్యత్తులో ఉబకాయం, గుండె జబ్బులు, రక్త పోటు, డయాబెటిస్,అల్జిమర్ వంటి ప్రమాదకర వ్యాధులతో జీవితాంతం పోరాటం చేయాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరికొందరైతే నిద్రలేమి సమస్యను అధిగమించడానికి నిద్ర మాత్రలకు, మద్యపానానికి బానిసలు అవుతుంటారు. ఈ అలవాట్లు మరిన్ని కష్టాలను తెచ్చిపెడతాయి గుర్తుంచుకోండి.

మనకు సుఖప్రదమైన నిద్ర కలగాలంటే మెదడు కింది భాగంలోని పీయూష గ్రంథి స్రవించే మెల‌టోనిన్ అనే
హార్మోన్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. ఈ హార్మోన్ ఉత్పత్తిలో సమస్య కలిగితే నిద్రలేమి సమస్యకు కారణం అవుతుంది. ఈ గ్రంధి సేవించే హార్మోన్ మోతాదులను బట్టి మన నిద్ర, మెలకువలను నియంత్రించే జీవగడియారం పనితీరు ఆధారపడి ఉంటుంది. అందుకే నిద్రలేమితో బాధపడేవారికి వైద్యులు కృత్రిమ మెలటోనిన్‌ హార్మోన్‌ను సూచిస్తుంటారు. అయినా ఈ కృత్రిమ హార్మోను ఎక్కువ రోజులు తీసుకున్న మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కనుక సహజ మెల‌టోనిన్ హార్మోను ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవడం ఉత్తమం.

ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి గంట ముందు గోరు వెచ్చని పాలల్లో బాదం, తేనె, కుంకుమ పువ్వు కలిపి సేవిస్తే కుంకుమపువ్వులో క్రోసిన్, సఫ్రానాల్ , పిక్రోక్రోసిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి కావున డిప్రెషన్ ఆందోళన వంటి లక్షణాలను తొలగించి నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. స‌హ‌జంగా మెల‌టోనిన్ ఎక్కువగా ల‌భించే గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, పిస్తాను ప్రతిరోజు రాత్రి సమయంలో కొన్ని తీసుకోవడం వల్ల నిద్రలేని సమస్యను అధిగమించవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉన్న బాదం, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ ను పరిమితంగా తీసుకుంటే మంచి నిద్ర కలుగుతుంది. దాంతోపాటే ఉదయం, సాయంత్రం గంటసేపు నడక, వ్యాయామం, ధ్యానం వంటివి అలవాటు చేసుకుంటే నిద్రలేమి సమస్యకు సులువుగా చెక్ పెట్టవచ్చు..