Milk: పాలు తాగితే ఆరోగ్యం.. వాటిని కలిపి తాగితే మాత్రం అనారోగ్యమే..!!

Milk: పాలు మనకు ఎంత ఆరోగ్యాన్నిస్తాయో తెలిసిందే. అందుకే చిన్నా, పెద్దా అంతా పాలు తాగకుండా ఉండలేరు. చిన్నారులు ఎంత ఇష్టంగా పాలు తాగుతారో వారి పెదాలకు అంటుకునే పాల గుర్తులే చెప్తాయి. పెద్దలు కూడా గ్లాసుడు పాలు ఎంతో ఇష్టంగా తాగుతారు. ఎముకల పటిష్టతకు పాలలో ఉండే పోషకాలే ఇందుకు కారణం. మన జీర్ణక్రియను మెరుగుపర్చడంలో పాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని విటమిన్స్, ప్రోటీన్స్, లాక్టోజ్, షుగర్ ఎంతో మేలు చేస్తాయి. అయితే పాలను విడిగా తాగడం ఎంత మంచిదో కొన్ని పదార్ధాలతో కలిపి తాగడం అంతే ప్రమాదమని నిపుణులు అంటున్నారు.

పండ్లు: పాలు, పండ్లను కలిపి తీసుకోకూడదు. పాలు తాగే ముందు పండ్లు తినకూడదు. పాలు తాగిన వెంటనే కూడా పండ్లు తినకూడదు. ఆరెంజ్, పైన్ ఆపిల్, ఉసిరి వంటి పులుపు ఉండే పండ్లను పాలతో కలిపి తీసుకోకూడదు. దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది. జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. సరిగా అరగక వాంతులు వచ్చే అవకాశం ఉంది.

యోగర్ట్: పెరుగు లాంటి పదార్ధం. దీనిని పాలతో కలిపి తినకూడదు. వీటిని రెండూ కలిపి మిక్స్ చేసి తింటే గ్యాస్, వికారం, వాంతులు వచ్చే అవకాశం ఉంది. యోగర్ట్ విడిగా తిన్న తర్వాత.. గంట లేదా రెండు గంటల తర్వాత పాలు తాగితే సమస్య ఉండదు.

స్పైసీ ఫుడ్‌: మసాలా ఎక్కువుండే ఆహారంతో పాలను తాగకూడదు. ఇవి అరగవు. స్కిన్ సమస్యలు ఎక్కువవుతాయి.

చేపలు: పాలు, చేపల కాంబినేషన్లో అసలు తీసుకోకూడదు. దీనివల్ల గ్యాస్, స్కిన్ అలర్జీ సమస్యలు వస్తాయి. పాలు జీర్ణక్రియకు ఎంత చక్కగా ఉపయోగపడతాయో దీనిని మిక్స్ చేసి తీసుకుంటే సమస్యలు వస్తాయి.

నువ్వులు: పాలు, నువ్వులూ కలిపి తీసుకోకూడదు. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి.

పైన చెప్పిన వాటిల్లో విడివిడిగా.. వేర్వేరు సమయాల్లో ఏవి తీసుకున్నా సమస్య ఉండదు. కలిపి తీసుకుంటే మాత్రం ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.