ఆముదం నూనెను ఎక్కువగా ఉపయోగించేవారు ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

మన పూర్వికులు ఆముదం నూనెను చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే బ్యూటీ స్కిన్ ఆయిల్ గా ఉపయోగించేవారు.వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. పూర్వం పసి పిల్లలకు ఒళ్లంతా ఆముదం నూనెతో మర్దన చేసి తలంటు స్నానం చేయించేవారు. దీంతో చిన్నపిల్లల చర్మ సమస్యలన్నీ తొలగిపోయి చర్మం సహజ కాంతివంతంగా ఆరోగ్యంగా ఉండేది. కాలానుగుణంగా ఎన్నో బ్యూటీ స్కిన్ ఆయిల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ సహజ సిద్ధంగా లభించే ఆముదం నూనెకు మరేదీ సాటి రాదు అని చెప్పొచ్చు. ఆముదం నూనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆముదం నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉన్నందున తరచూ ఆముదం నూనెను శరీరంపై మర్దన చేసుకుంటే చర్మ అలర్జీలు ఇన్ఫెక్షన్లు తొలగిపోవడమే కాకుండా చర్మంపై తగినంత తేమను నిలిపి చర్మం మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది. అలాగే వారంలో ఒకటి లేదా రెండుసార్లు ఆముదం నూనెను తల కుదురులకు అంటే విధంగా మర్దన చేసుకుంటే ఇందులో ఉండే ఔషధ గుణాలు జుట్టు కుదుర్లను దృఢపరిచి జుట్టు రాలడం, చుండ్రు, పొక్కులు వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి.

తీవ్రమైన కీళ్ల నొప్పులు ఒళ్ళు నొప్పులు సమస్యతో బాధపడేవారు గోరువెచ్చని ఆముదం నూనెతో మసాజ్ చేసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. చాలా సందర్భాల్లో ఆముదం నూనెను మలబద్ధకాన్ని, సులి పురుగుల సమస్యను నివారించడంలో ఉపయోగిస్తారు. ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందడానికి ఆముదం నూనెను తలపై మర్దన డిహైడ్రేషన్ సమస్య తొలగిపోతుంది. పొడిబారిన చర్మం పై ఆముదం నూనెను అప్లై చేస్తే మృత కణాలు తొలగిపోవడమే కాకుండా ముఖంపై ముడతలు తగ్గించి చర్మాన్ని బిగుతుగా తయారు చేస్తుంది. ఎండ దెబ్బ తగిలినప్పుడు అరిచేతులు అరికాళ్ళపై చమరును మర్దన చేసుకుంటే వడదెబ్బ లక్షణాలు వెంటనే తొలగిపోతాయి.