పులిపిర్ల సమస్యతో బాధపడుతున్నారా… ఇలా చేస్తే చాలు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు!

చాలామంది ఎదుర్కొనే సమస్యలలో పులిపిర్లు సమస్య ఒకటి.ఇది రావడం ఎంతో సర్వసాధారణమైన విషయం అయితే చాలామందికి మొహం పైన ఈ పులిపిర్లు ఏర్పడటం వల్ల కాస్త అందవిహీనంగా ఉంటుందని పులిపిర్లు తొలగించుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఎలాంటి నొప్పి లేకుండా కేవలం ఇంట్లో దొరికే వాటితో సహజసిద్ధంగా ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. ఈ పులిపిర్ల సమస్య అనేది ప్రతి 15 మందిలో ఒకరికి ఈ సమస్య ఉంటుంది.

ఈ సమస్య మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తాయి.ఇవి రావటానికి ప్రధానకారణం హ్యూమన్ పాపిలోమా వైరస్. అయితే ఈ సమస్య నుంచి బయట పడటానికి మన ఇంట్లో దొరికే కోల్గేట్ పేస్ట్ ఆముదపు నూనె బేకింగ్ పౌడర్ ఉంటే చాలు ఎలాంటి నొప్పి లేకుండా కేవలం మూడు రోజులలోనే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.చిటికెడు బేకింగ్ పౌడర్ లోకి కాస్త పేస్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆముదపు నూనె వేసి మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు పులిపిరి ఉన్నచోట వేసి దానిపై కాటన్ పెట్టి ప్లాస్టర్ వేయాలి.

ఈ విధంగా రెండు రోజులపాటు చేయటం వల్ల ఎలాంటి నొప్పి లేకుండా పులిపిర్లు రాలిపోతాయి. ఇదే కాకుండా వెల్లుల్లి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వెల్లుల్లిని మెత్తని మిశ్రమంలా తయారు చేసి ఆ మిశ్రమాన్ని పులిపిర్లు ఉన్నచోట రాయటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఎలాంటి నొప్పి లేకుండా పులిపిర్ల సమస్యకు ఈ సహజ పద్ధతులలో కూడా చెక్ పెట్టవచ్చు.