బరువు తగ్గాలనుకునేవారు ఈ దోసెను ట్రై చేయండి… అద్భుతమైన ఫలితం ఉంటుంది!

ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనవి తొందరగా శరీర బరువు పెరగడం ఈ సమస్యకు కారణాలను పరిశీలిస్తే రోజువారి మనం తీసుకునే ఆహారంలో క్యాలరీలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటూ కార్బోహైడ్రేట్స్, ఫైబర్ తక్కువగా ఉండడం ఒక కారణమైతే మరో కారణం పట్టణ జీవనానికి అలవాటు పడి శారీరక శ్రమ లేకపోవడం మరో ప్రధాన కారణంగా చెప్పొచ్చు. శరీర బరువు పెరగడం కారణంగా ఉబకాయం, హై బీపీ, మధుమేహ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు భవిష్యత్తులో మనల్ని చుట్టుముడతాయి.

శరీర బరువు నియంత్రణలో ఉండాలంటే ప్రతి రోజు మనం తీసుకునే ఆహారంలో కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తోపాటు అత్యధికంగా ఫైబర్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దీనికోసం చిరుధాన్యాల్లో ప్రధానంగా చెప్పుకునే జొన్నలను ఆహారంగా తీసుకుంటే ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించి శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే రక్తంలో గ్లూకోస్ స్థాయిలను క్రమబద్ధీకరించి డయాబెటిస్ వ్యాధి ముప్పు నుంచి మనల్ని రక్షిస్తాయి. ఇందుకోసం ప్రతిరోజు ఉదయాన్నే అల్పాహారంలో జొన్న దోసెను మన అల్పాహార మెనులో చేర్చుకోవచ్చ అని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు.

జొన్న దోశ తయారి విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా జొన్న పిండిలో తగినన్ని నీళ్లు వేసుకొని బాగా కలవడం కోసం కొద్దిసేపు గ్రైండ్‌
చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మినప్పప్పు, మెంతులను కడిగి మంచినీటిలో ఐదారు గంటల సేపు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని తీసివేసి ఉప్పు కలిపి మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఆ పిండిని ఒక పెద్ద పాత్రలోకి తీసుకుని అదే గిన్నెలోకి ముందుగా నానబెట్టుకున్న జొన్నపిండి మిశ్రమాన్ని కలిపి రాత్రంతా మూత పెట్టి ఉంచాలి. ఇలా సిద్ధం చేసుకున్న జొన్నపిండి మిశ్రమంతో వేడి వేడి జొన్న దోసెలను వేసుకొని రుచికరంగా తినొచ్చు.