Keerthy Suresh: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నేను శైలజ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ అదే ఊపుతో మరిన్ని సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించింది కీర్తి సురేష్. ఇటీవలే ఆమె తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికొస్తే తాజాగా ఆమె బేబీ జాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
వరుణ్ ధవన్ హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవల క్రిస్మస్ పండుగ కానుకగా విడుదల అయింది. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఈ సినిమా కోసం చాలా కష్టపడిందని చెప్పాలి. తన పర్సనల్ లైఫ్ ను పక్కన పెట్టి మరి పెళ్లి అవ్వగానే వెంటనే ప్రమోషన్స్ కార్యక్రమాలలో మునిగిపోయింది. కానీ బేబీ జాన్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది. ఇకపోతే సినిమా కోసం తరచూ ముంబై వెళ్తోంది కీర్తి.
ఈ క్రమంలో తాజాగా కూడా కీర్తి అక్కడికి వెళ్ళగా ఫోటో గ్రాఫర్లు ఆమను కెమెరాల్లో బంధించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు తనను కృతి అని పిలిచారు. దీంతో ఆమె.. నా పేరు కృతి కాదు కీర్తి అని చెప్పింది. ఇకపోతే సౌత్ ఇండియన్ యాక్టర్స్ ను అక్కడి ఫోటో గ్రాఫర్లు దోస అని పిలుస్తుంటారు. అలా కొందరు దోస అని పిలవడంతో ఆమె అభ్యంతరం చెప్పింది. నా పేరు కీర్తి దోస కాదు కీర్తి సురేశ్. కానీ నాకు దోస అంటే చాలా ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియో పై నెటిజన్స్ విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు..