దోస అంటుకోకుండా రావాలంటే ఈ పనులు చేయాల్సిందే.. ఈ విషయాలు మీకు తెలుసా?

మనలో చాలామంది దోసను ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. దోస తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇంట్లో చేసే దోస అంటుకోకుండా రావాలంటే మాత్రం కొన్ని చిట్కాలను కచ్చితంగా పాటించాలి. జిడ్డు లేకుండా పెనం శుభ్రంగా ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత పెనాన్ని స్టవ్ పై పెట్టి చిన్న మంట మీద వేడి చేయాల్సి ఉంటుంది.

పెనం మీద నీళ్లు చల్లిన తర్వాత ఆ నీళ్లు చిటపటమని ఆరిపోవాలి. అలా చేస్తే దోసె వేయడానికి పెనం అనుకూలంగా ఉందని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత పెద్ద ఉల్లిపాయను కోసి పెనం అంతటా రుద్దాలి. ఈ విధంగా చేయడం వల్ల పెనం శుభ్రంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత గరిటె లేదా గిన్నె సహాయంతో పిండిని పెనం వేసి గుండ్రంగా రుద్దాలి.

ఆ తర్వాత దోశపై కొన్ని నూనె చుక్కలు వేయాలి. మీడియం ఫ్లేమ్ మంటతో దోసలను తయారు చేసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్పవచ్చు. దోసలు ఎక్కువగా తినేవాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. దోసలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. దోసలు ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తినడానికి పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు.

అయితే దోసలు మరీ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కువగా తినడం వల్ల గ్యాస్ ట్రబుల్, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. దోసలు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయని చెప్పవచ్చు.