అధిక బరువుతో బాధపడేవారు సన్నగా, నాజూగ్గా అవ్వాలంటే….ఈ డ్రింక్స్ తాగాల్సిందే?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడమే కాకుండా పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎలాంటి శ్రమ లేకుండా పనులు చేయడం జరుగుతుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు ప్రధాన కారణాలు శారీరక శ్రమ తగ్గడం, ఆహారపు అలవాట్లు, ఆల్కహాల్ సేవించడం, ధూమపానం, వంశపారంపర్యం వంటివి ప్రధానంగా చెప్పవచ్చు. శరీర బరువును నియంత్రించుకోవడానికి వ్యాయామం, నడక, ఆహారపు అలవాటులో మార్పులు చేసుకోవడంతోపాటు కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలతో అద్భుత ఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయాన్నే అల్పాహారానికి ముందు ఔషధ గుణాలతో కూడిన జ్యూసులను సేవిస్తే అతి బరువు సమస్యతో పాటు అనేక రకాల మొండి వ్యాధులను సైతం తరిమి కొట్టవచ్చు.

మన ఇంటిలో తప్పకుండా ఉండే ధనియాలు శరీర బరువును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ప్రతిరోజు ధనియాలతో కషాయాన్ని తయారు చేసుకుని సేవిస్తే ఇందులో ఉండే పాలీఫినాల్స్ అనే ఔషధ గుణం కొవ్వులతో పోరాడడం‌లో మరియు వాటి డిపాజిషన్ నివారించడం‌లో సహాయపడుతుంది. తద్వారా శరీర బరువును సునాయాసంగా తగ్గించుకోవచ్చు.
బరువు తగ్గడానికి యాపిల్ సైడర్ వెనిగర్‌ మంచి ఫలితాలను ఇస్తుందని కొన్ని పరిశోధనలు తేలింది.
10 ఎంఎల్ యాపిల్ సైడర్ వెనిగర్ 200 మి.లీ నీటిలో
కలుపుకొని ప్రతిరోజు ఉదయం అల్పాహారానికి ముందు సేవిస్తే బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

వంటకాల్లో రుచికి వాడే దాల్చిన చెక్క బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ పరాసిటిక్ లక్షణాలు కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.దాల్చిన చెక్క నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలుపుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.

మెంతి గింజలను నానబెట్టి తర్వాత రోజు ఆ నీటిలో కొద్దిగా తేనె కలుపుకొని సేవిస్తే ఇందులో ఉండే సపోనిన్‌లు, ఫైబర్ లక్షణాలు బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.జిలకరను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే జిలకర నీటినీ ప్రతిరోజు సేవిస్తే ఇవి బరువు తగ్గించే ఎంజైములను ఉత్తేజపరిచి అతిబరు సమస్యకు పరిష్కారం చూపుతాయి. అలాగే నిమ్మరసంలో తేనె కలుపుకొని పరగడుపున సేవించిన మంచి ఫలితం ఉంటుంది. జీర్ణ సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు. ఈ పానియాలను తీసుకునే ముందు వైద్యుల్ని సంప్రదించడం మంచిది.