ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం గుండె నొప్పి వచ్చే అవకాశం.. జాగ్రత్త పడాల్సిందే!

మనలో చాలామంది ఆరోగ్యం విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. గుండెకు సంబంధించిన సమస్యల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఛాతీలో బరువుగా, బిగుతుగా, నొప్పిగా అనిపిస్తే ‘ గుండె నొప్పి వచ్చే అవకాశం ఉందని గమనించాలి. వాంతులు, వికారం, అజీర్ణం, గుండెల్లో మంట లాంటి లక్షణాలు గుండెపోటు వచ్చే ముందు సంకేతాలు అని చెప్పవచ్చు.

ఎడమవైపున కాళ్లు లాగడం, నొప్పిగా ఉండటం కూడా గుండె సంబంధిత సమస్యల లక్షణాలు అని చెప్పవచ్చు. తల తిరుగుతున్నట్టు అనిపించడం కూడా గుండె నొప్పి సంకేతం అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. కొంచెం పని చేసినా అలసటగా అనిపిస్తుంటే కూడా గుండె సంబంధిత సమస్య కారణం కావచ్చని గుర్తు పెట్టుకోవాలి.

ఎక్కువగా గురక పెట్టేవాళ్లు సైతం గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ పెరగడం లేదా తగ్గడం, శ్వాస సంబంధిత సమస్యలు కూడా గుండె సమస్యలకు కారణం అవుతాయని చెప్పవచ్చు. గుండె నొప్పి విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు.

సరైన సమయంలో వైద్యులను సంప్రదించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా రక్షించుకోవచ్చు. తీవ్రమైన వ్యాయామం, అధిక రక్తపోటు, హార్మోన్ల మార్పులు గుండె నొప్పికి కారణమవుతాయి. జీర్ణ సమస్యలు, కండరాలకు సంబంధించిన సమస్యలు చెడు వాయువులు కూడా గుండె సంబంధిత సమస్యలకు కారణమయ్యే అవకాశం అయితే ఉంది.