డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు రోజువారి కార్యకలాపాల్లో ఈ మార్పులు తప్పనిసరి!

Complication-of-Uncontrolled-Diabetes

ప్రస్తుత రోజుల్లో ఎక్కువమందిని పట్టి పీడిస్తున్న వ్యాధుల జాబితాలో డయాబెటిస్ ప్రథమ స్థానంలో ఉందని చెప్పొచ్చు.ఇది ఆందోళన కలిగించే అంశమే అయినప్పటికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాధి తీవ్రత మాత్రం అదుపులోకి రావట్లేదని చాలామంది చెబుతుంటారు.డయాబెటిస్ వ్యాధిని నిర్లక్ష్యం చేసి అదుపులో ఉంచుకో లేకపోతే నరాల బలహీనత, కంటి చూపు తగ్గడం, కిడ్నీ సమస్యలు,గుండె జబ్బులు,దంతాలు ఊడిపోవడం, లైంగిక శక్తి తగ్గడం, అల్జీమర్ వంటి అనేక అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.

అసలు డయాబెటిస్ వ్యాధి రావడానికి గల కారణాలను పరిశీలిస్తే చాలామందిలో క్రమబద్ధతిలేని ఆహారపు అలవాట్లు, ఒకే చోట కూర్చొని ఎక్కువగా పనిచేయడం వల్ల శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలను చెప్పొచ్చు. మరికొందరిలో జన్యు సంబంధమైన కారణాలు, ఉబకాయం, అధిక కొలెస్ట్రాల్ సమస్య వల్ల కూడా డయాబెటిస్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఏదిఏమైనా డయాబెటిస్ ను అదుపులో ఉంచాలంటే మన ఆహారపు అలవాట్లలో మార్పు రావాలి.

మొదట కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న పాలిష్ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం తగ్గించి అత్యల్ప క్యాలరీలు, అధిక ఫైబర్ కలిగిన చిరుధాన్యాలను రోజువారి ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. తద్వారా రక్తంలో గ్లూకోస్ స్థాయిలు నియంత్రించబడి డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ప్రతిరోజు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పెరుగుకు బదులు మజ్జిగ తినండి. పెరుగులో అత్యధిక ప్రోటీన్స్, కొవ్వు కలిగి ఉండడం వల్ల ఉబకాయ సమస్యకు దారి తీయవచ్చు.తద్వారా డయాబెటిస్ వ్యాధి మరింత తీవ్రమౌతుంది.ప్రతిరోజు 8 గంటల నిద్ర నియమాన్ని కచ్చితంగా పాటించాలి. మన ఆరోగ్యం కోసం కొంత సమయం కేటాయించి ఉదయం సాయంత్రం వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ యోగ, ధ్యానం, వ్యాయామం వంటివి అలవాటు చేసుకుంటే సరిపోతుంది.