సాధారణంగా ఎంత కష్టపడి పని చేసినా కూడా సంపాదించిన డబ్బు మొత్తం ఏదో ఒక రూపంలో ఖర్చవుతుంది ఆర్థిక సమస్యలు తెలుపుతూ ఉంటాయి. సమస్యలు తలగటానికి మనకున్న కొన్ని అలవాట్లు కూడా కారణం. మనకు ఉన్న కొన్ని అలవాట్ల వల్ల ఎంత కష్టపడి పని చేసినా కూడా అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడి ఆ పనులు ఆగిపోతాయి. అలాంటి అలవాట్లు మనం కోకపోవడం వల్ల జీవితాంతం దరిద్రం చుట్టుకొని కష్టాలతో కొట్టుమిట్టాడుతూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అటువంటి కష్టాల నుండి బయటపడటానికి మార్చుకోవాల్సిన అలవాట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశగా ఇంట్లో బరువైన వస్తువులు ఉంచరాదు. ఇలా ఉత్తరం వైపు బరువైన వస్తువులు ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడి సమస్యలు మొదలవుతాయి.
• అలాగే ఉత్తర దిశగా నలుపు రంగు దుస్తులు కూడా ఉంచరాదు. ఇలా ఉంచటం వల్ల కూడా సమస్యలు ఏర్పడతాయి.
• అలాగే సంధ్యా సమయం తర్వాత ఇంట్లో చీపురు పట్టుకొని ఉడ్చటం వల్ల కూడా దరిద్రం చుట్టుకుని తరచూ సమస్యలతో సతమతమవుతారు.
• అలాగే కొందరు తినగలిగిన దానికంటే ఎక్కువ ఆహారం పెట్టుకొని దానిని వృధా చేస్తూ ఉంటారు. ఇలా ఆహారాన్ని వృధా చేయటం వల్ల భవిష్యత్తులో ఆహారం దొరకంగా ఆకలితో ఉండాల్సి వస్తుంది.
• అలాగే మరికొంతమంది భోజనం చేసిన తర్వాత ఆ పాత్రలను శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది.
• అలాగే ఇంటి పరిసర ప్రాంతాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలాకాకుండా ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండకపోవటమే కాకుండా ఇంటి పరిసర ప్రాంతాలలో ఉమ్మి వేయడం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు. దీంతో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి.