క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరుల యావత్ ప్రపంచాన్ని కబలిస్తోంది. క్యాన్సర్ వ్యాధి రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధాన కారణం మన జీవిత గమనంలో సమూలమైన మార్పులు ఆహారపు అలవాట్లేనని అనేక సర్వేలు వెళ్లడైంది. భవిష్యత్తులో క్యాన్సర్ వ్యాధి ప్రమాదం నుంచి బయటపడాలంటే ఇప్పటికైనా మేల్కొని క్రమబద్ధమైన జీవన విధానాన్ని ఆహారపు అలవాట్లని అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అసలు క్యాన్సర్ వ్యాధి తలెత్తడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజు ఉదయాన్నే కాఫీ, టీ వంటి పానీయాలను తాగకపోతే ఆరోజు మొత్తం గడవదు. ఈ అలవాటు వల్ల ఎలాంటి సమస్య రాదు. కానీ కాఫీ ,టీ వంటి పానీయాలను 60 డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద రోజుకు 700 మిల్లీలీటర్లు లేదా అంతకంటే ఎక్కువ పరిమాణంలో తాగే వారిలో భవిష్యత్తులో ఈసోఫెగల్ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు 90 % ఎక్కువగా ఉంటాయట. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే రోజుకు రెండు కప్పుల మించి కాఫీ తాగే వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. కారణం కాఫీలో అక్రిలామైడ్ అనే క్యాన్సర్ కారక రసాయనం ఎక్కువగా ఉండడమే.
క్యాన్సర్ ప్రమాదం పెరగడానికి మరో ప్రధానమైన కారణం ఆల్కహాల్ సేవించడమే. ఆల్కహాల్ ను ఎప్పుడో ఒకసారి పరిమితంగా తీసుకుంటే ఎటువంటి సమస్య రాదు కానీ ప్రతిరోజు మోతాదుకు మించి ఆల్కహాల్ సేవించే వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం దాదాపు 70% ఉంటుందని అనేక సర్వేలు స్పష్టమైనది. ముఖ్యంగా లివర్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, ఉదర క్యాన్సర్ ప్రమాదాలకు ఆల్కహాలే ఎక్కువ కారణమని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పగళ్ళు తేడా లేకుండా సెల్ ఫోన్ తో సహజీవనం చేసేవారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందట. కారణం సెల్ ఫోన్ నుంచి వెలువడే అధిక రేడియేషన్ ప్రభావం. కాబట్టి సెల్ ఫోను అవసరాలకు మించి వాడకపోవడమే మంచిది.