మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ చెడు అలవాట్లు ఉంటే ప్రమాదమంటూ?

symptoms-of-liver-damage

ప్రస్తుత కాలంలో ఆరోగ్యం విషయంలో తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే సంగతి తెలిసిందే. ఆరోగ్యం విషయంలో చిన్నచిన్న తప్పులు చేసినా ఆ తప్పులు తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలను తీసుకోవడంతో పాటు కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది. సిగరెట్లు, మందు లాంటి అలవాట్లు ఆరోగ్యానికి తీవ్రస్థాయిలో హాని చేస్తాయి.

కాలేయం ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం అయితే ఉంటుంది. కాలేయం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శరీరంలోని ఇతర అవయవాలు కూడా దెబ్బ తినే ఛాన్స్ అయితే ఉంటుంది. పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

తృణధాన్యాలను ఆహారంలో భాగం తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి మేలు జరుగుతుందని తెలుస్తోంది. రక్తంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేసే విషయంలో తృణధాన్యాలు ఉపయోగపడతాయి. చికెన్, చేపలు, బీన్స్, లీన్ ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు తీసుకోవడం ఎంతో మంచిదని చెప్పవచ్చు.

గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కాఫీ తాగడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఆలివ్ ఆయిల్ తో చేసిన వంటకాలు తినడం వల్ల కాలేయం ఆరోగ్యం విషయంలో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. పసుపును ఆరోగ్యంలో భాగం చేయడం వల్ల హెల్త్ కు మంచిదని చెప్పవచ్చు.