రక్తహీనత సమస్యను అధిగమించాలంటే ప్రతిరోజు దీన్ని తినాల్సిందే!

అవకాడో ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.అవకాడో కొంత ఖరీదైన పండు అయినప్పటికీ తప్పనిసరిగా దీన్ని ఆహారంగా తీసుకోవాలని న్యూట్రిషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అవకాడ ఫ్రూట్స్ లో అన్ని రకాల విటమిన్స్ తో పాటు ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్, పైబర్స్,కాల్షియం,ఐరన్, మెగ్నీషియం, పొటాషియం,సోడియం, జింక్,థియామిన్, ఫోలేట్ రైబోఫ్లేవిన్, నియాసిన్,మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు, సహజ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. తరచూ అవకాడోను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

 

ముఖ్యంగా అవకాడో ఫ్రూట్స్ లో అత్యధిక ప్రోటీన్స్ లభించి అత్యల్ప కొలెస్ట్రాల్ నిల్వలు కలిగి ఉంటాయి కనుక రోజువారి డైట్ లో చేర్చుకుంటే శరీర బరువును సహజ పద్ధతిలో నియంత్రించుకోవచ్చు. మరియు ఈ పండు గుజ్జులో ఉండే మోనోసాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి ఉపకాయం,రక్తపోటు,గుండె జబ్బుల ప్రమాదం నుంచి మనల్ని రక్షిస్తాయి.ముఖంపై మడతలు, చర్మం పొడిబారడం వంటి సమస్యలతో బాధపడేవారు అవకాడో పండ్లను ఆహారంగా తీసుకుంటే వీటిలో అత్యధికంగా ఉన్న విటమిన్ ఎ, సి, ఇ మరియు మినరల్స్ చర్మ కణాలకు తగిన శక్తిని అందించి చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా తయారు చేయడంలో సహాయపడుతుంది.

 

అవకాడో లో అత్యధికంగా ఉన్న కాల్షియం, ఫాస్ఫరస్ జింకు వంటి ఖనిజ లవణాలు ఎముకల దృఢత్వానికి తోడ్పడి ఆస్తియోపోరోసిస్,ఆర్థరైటిస్, రుమటాయిడ్ వ్యాధి తీవ్రతను తగ్గించి వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటి సమస్యలను తగ్గిస్తుంది. తీవ్ర మానసిక ఒత్తిడి సమస్యతో బాధపడేవారు తరచూ అవకాడోను ఆహారంగా తీసుకుంటే ఇందులో సమృద్ధిగా ఉండే మెగ్నీషియం, విటమిన్ బి12 వంటి పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరిచి డిప్రెషన్, ఆందోళన, చికాకు వంటి సమస్యలను తొలగిస్తుంది. అవకాడో లో అత్యధికం గా ఉన్న ఐరన్, పోలేట్, విటమిన్ బి12 ఎర్ర రక్త కణాల అభివృద్ధికి తోడ్పడి ప్రమాదకర రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది మరియు మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో రక్తస్రావాన్ని తగ్గించడంలో సహాయపడి గర్భంలోని శిశువు ఎదుగుదలకు నాడీ కణ అభివృద్ధికి సహాయపడుతుంది.