ఈ సమస్యతో బాధపడుతున్నారా… అయితే సీతాఫలానికి దూరంగా ఉండాల్సిందే?

సంవత్సరంలో శీతాకాలంలో మాత్రమే లభించే అతి మధురమైన ఫలం సీతాఫలం. సీతాఫలం మధురమైన రుచిని అందించడంతోపాటు మన శరీర పెరుగుదలకు అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయి.అందుకే దీన్ని ఇరవయ్యొకటో శతాబ్దపు సూపర్ ఫ్రూట్‌గానూ వైద్యులు అభివర్ణిస్తున్నారు. అలాగే సీతాఫలం చెట్టులోని ఆకులు, బెరడు ,వేర్లు ఇలా ప్రతి భాగంలో ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉండి మనలో వ్యాధి కారకాలను తొలగించడానికి సహాయపడుతుంది. సీజనల్గా లభించే సీతాఫలం పండ్లను ప్రతిరోజు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సీతాఫలం పండులో సమృద్ధిగా విటమిన్ సి ఉంటుంది. కావున ప్రతిరోజు ఈ పండుని తినడం వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించి సీజనల్గా వచ్చే అనేక వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు.

సీతాఫలం పండులో అధికంగా ఉండే ఐరన్ రక్తంలోని
హీమోగ్లోబిన్ శాతాన్ని బాగా పెంచుతుంది. తద్వారా అనీమియా వంటి ప్రమాదకర వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

వంద గ్రాముల సీతాఫలంలో 94 క్యాలరీలు వస్తాయి. ఆపిల్ ,జామ, మామిడి, బొప్పాయి, బత్తాయి వంటి పండ్లతో పోలిస్తే ఇందులో క్యాలరీలు ఎక్కువ. కాబట్టి తక్కువ బరువుతో బాధపడేవాళ్లు ప్రతిరోజు సీతాఫలాన్ని ఆహారంగా తీసుకుంటే శరీరానికి శక్తినిచ్చి బరువు పెరగడంలో సహాయపడుతుంది.

సీతాఫలం గుజ్జులో అధికంగా కాల్షియం ,మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. కాల్షియం ఎముకలు దృఢంగా ఉండడానికి తోడ్పడుతుంది. పొటాషియం రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్త పోటుకు దూరంగా ఉంచుతుంది.

సీతాఫలం పండులో పుష్కలంగా ఉన్న నియాసిన్ చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు తోడ్పడుతుంది. తద్వారా గుండె జబ్బులు, దీర్ఘ కాయ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

సీతాఫలం పనులలో ఉన్న ఎసిటోజెనిన్ రసాయనాలు చర్మ క్యాన్సర్ల నుండి రక్షిస్తాయి. అలాగే ఈ పండులో ఉన్న ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకం, గ్యాస్టిక్ వంటి సమస్యలను తొలగించుకోవచ్చు.

సీతాఫలంలో అత్యధిక కేలరీలు ఉన్నందున అతి బరువు సమస్యతో బాధపడేవారు ఈ పండ్లను ఎక్కువగా తింటే అధిక కేలరీల కారణంగా మరింత బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కనుక
ఈ పండ్లను తినకపోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.