మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారు? కారణం మీ రోజువారి అలవాట్లే కావచ్చు..

సాధారణంగా వయసు మళ్లిన తర్వాత వచ్చే మతిమరుపు వ్యాధి ప్రస్తుత కాలంలో విద్యార్థులను, యువతరాన్ని ఎక్కువగా వేధిస్తానని వైద్య నిపుణులు చెబుతున్నారు.దీన్ని అల్జీమర్ వ్యాధి అని కూడా అంటారు. ఈ మానసిక వ్యాధికి ప్రధాన కారణం మారుతున్న జీవన విధానం ఆహారపు అలవాట్లే అని చెప్పొచ్చు. అల్జీమర్ వ్యాధి బారిన పడితే దీనికి చికిత్స చాలా కష్టం. అందుకే చిన్న వయసులోనే ఈ వ్యాధి బారి నుంచి తప్పించుకోవడానికి మన జీవన విధానంలో కొన్ని నియమాలు, జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది.

ఈ రోజుల్లో అధిక పని ఒత్తిడి కారణంగా అనేక మానసిక సమస్యలతో పాటు శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి ఈ సమస్యలను అధిగమించడానికి మనలో ఒత్తిడిని తగ్గించి మెదడు చురుగ్గా పనిచేయ డానికి కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం, నడక , యోగ వంటివి తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. అధిక ఒత్తిడి సమస్య ఉన్నప్పుడు మానసిక ఆనందాన్ని పొందడానికి మీకు ఇష్టమైన సంగీతం, ఆర్ట్స్, డాన్స్ , గార్డెనింగ్ వర్క్, మీకు ఇష్టమైన వ్యక్తులను కలవడం వంటివి చేస్తే ఒత్తిడి సమస్య నుంచి బయటపడి మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

నాడీ కణాలను దెబ్బతీసి మెదడు చురుకుదనాన్ని తగ్గించే ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ,సాఫ్ట్ డ్రింక్ వంటి వాటిని పూర్తిగా పక్కనపెట్టి. సహజ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న పండ్లు, కూరగాయలను, డ్రై ఫ్రూట్స్ వంటి పోషక పదార్థాన్ని మన రోజు వారి ఆహారంలో ఉండునట్లు చూసుకోవాలి. అల్జీమర్ వ్యాధికి ప్రధాన కారణం నిద్రలేమి సమస్య ఈ సమస్య నుంచి బయటపడడానికి కొంత శారీరిక శ్రమ కలిగిన వ్యాయామం యోగా వంటివి అలవాటు చేసుకోవడంతో పాటు అర్ధరాత్రి వరకు మొబైల్స్ , కంప్యూటర్స్ వాడడం తగ్గించాలి.