తరచూ మనం ఆహారంగా తీసుకునే కాకరకాయలో ఔషధగుణాలతో పాటు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే విటమిన్ ఏ,విటమిన్ బి1, విటమిన్ బి2, విటమన్ బి3,పొటాషియం, ఫైబర్, క్యాల్షియం, జింక్, థైయమిన్,బీట కేరొటిన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయుర్వేద వైద్యంలో కాకర గింజలను, కాకర ఆకులను ఎన్నో వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు.కాకరకాయను ఆయుర్వేదంలో కారవేల్లికా అని అంటారు.
కాకరకాయను ప్రతిరోజు కూర రూపంలోనే కాకుండా జ్యూస్ రూపంలో తీసుకుంటే సకల వ్యాధి సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఉదయాన్నే ఒక గ్లాస్ కాకర జ్యూస్ తీసుకుంటే భవిష్యత్తులో ఎదురయ్యే అనేక ప్రమాదకర వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. కాకరకాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి? వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి మొదట కాకరకాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పసుపు, ఉప్పు కలిపి కొద్దిసేపు ఉంచితే కొంత చేదు స్వభావం తగ్గుతుంది. తర్వాత ఈ ముక్కలను శుభ్రంగా కడుక్కొని వాటిలో నిమ్మరసం కొంత ఉప్పు కలిపి మిక్సీలో మిక్సీలో మెత్తగా జ్యూస్ మాదిరిగా తయారు చేసుకోవాలి. ఇలా వచ్చిన మిశ్రమాన్ని వడగట్టుకుని ఇతర పండ్ల రసాలతో కలిపి తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమైనట్టే.
ప్రతిరోజు కాకరకాయ జ్యూస్ ను సేవించడం వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తినీ పెంపొందించడంతోపాటు శరీరంలో క్యాన్సర్ కణాలను నశింపజేసి అనేక రకాల క్యాన్సర్ల నుండి మనల్ని రక్షిస్తుంది.కాకరకాయలో ఉండే హైపోగ్లసమిక్ పదార్ధము శరీరంలోని ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
అతి బరువు సమస్య ,అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు కాకరకాయ జ్యూస్ తాగితే శరీరంలో పేరుకుపోయిన చేడు కొలెస్ట్రాలను తగ్గించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.