Nose Bleeding: మనం తరచూ ఎన్నో రకాల అని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాము అయితే చాలామందిలో తరచూ ముక్కు నుంచి రక్తం కారడం జరుగుతుంది. ఇలా ముక్కు నుంచి రక్తం కారటం వల్ల చాలామంది ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. అయితే మరికొందరు ఇలాంటివి సర్వసాధారణమైనని భావిస్తూ ఉంటారు. ముక్కు నుంచి రక్తం కారడం అనేది అన్ని వయసుల వారిలోనూ ఉంటుంది కానీ మూడు సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసులోపు చిన్నారులలో ఈ సమస్య మరి కాస్త ఎక్కువగా కనిపిస్తుంది.
ఇలా చిన్న పిల్లలలో కూడా ముక్కు నుంచి రక్తం కారటం వల్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటారు అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా ముక్కు నుంచి రక్తం కారడానికి పలు కారణాలు ఉంటాయని వెల్లడించారు. ఇలా ముక్కు నుంచి రక్తం కారడానికి ముక్కు లోపల రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల రక్తస్రావం అనేది జరుగుతుంది.
పొడిగాలి కారణంగా ముక్కు లోపల ఉన్నటువంటి పొరలను పొడిగా చేయడంతో చికాకు కలుగుతుంది ఇది ముక్కు లోపలి రక్తనాళాలు చిట్లిపోవటానికి కారణమవుతుంది. అదేవిధంగా ముక్కుపై ఎక్కువ ఒత్తిడి కనుక ఉన్నట్లయితే రక్తనాళాలు పగిలిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అలర్జీ కారణంగా కూడా ముక్కు లోపలి రక్తనాళాలు వాపు గురి అవుతాయి తద్వారా రక్తస్రావం అనేది జరుగుతుంది.
అయితే ఇలా ముక్కు నుంచి రక్తం కారినప్పుడు కంగారు పడకుండా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ఇలా రక్త స్రావం జరుగుతున్న సమయంలో వంగకుండా ఇలా రక్తస్రావం జరుగుతున్న సమయంలో బోర్ల పనుకోవటం వల్ల మరింత రక్తస్రావం అవుతుంది అందుకే తలను పైకి పెట్టుకొని మెడ కింద కాస్త ఎత్తు చేయటం వల్ల రక్తస్రావం తగ్గుతుంది. బొటనవేలు సహాయంతో ఓ పది నిమిషాల పాటు ముక్కు రంధాన్ని అదిమి పెట్టడం వల్ల రక్తస్రావం తగ్గుతుంది. ఇక ముక్కుకి కోల్డ్ కంప్రెష్ చేయటం వల్ల రక్తనాళాలపై ఒత్తిడి తగ్గి రక్త స్రావం తగ్గుతుంది.