పురుషులలో చాలామంది మద్యం తాగడానికి ఇష్టపడతారు. పరిమితికి మించి మద్యం తాగితే ఆరోగ్యానికి నష్టమని తెలిసినా వేర్వేరు కారణాల వల్ల ఈ అలవాటుకు దూరం కాలేకపోతున్నామని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అయితే నిపుణులు పరిమితంగా మద్యం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు.
సరైన రీతిలో మద్యం తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతగానో మేలు జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే మితంగా మద్యం తాగుతారో వాళ్ల ఆయుష్షు పెరుగుతుంది. మితంగా మద్యం తీసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గే అవకాశంతో పాటు మెమొరీ పవర్ పెరిగే అవకాశం ఉంది. మద్యంతో నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మితంగా మద్యం తాగడంవల్ల గుండె ఆగిపోయే సమస్యలు దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది.
మితంగా మద్యం తాగడం వల్ల లిపోప్రొటీన్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రెడ్ వైన్ తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు, తుమ్ములు, ఇతర సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. కిడ్నీలో రాళ్లను దూరం చేయడంలో మద్యం ఉపయోగపడుతుంది. పరిమితంగా మద్యం తీసుకోవడం వల్ల మానసిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.
ఆహారం తిని ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా జరగనుందని సమాచారం అందుతోంది. మితమైన మద్యం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి అపాయం చేకూరదు. మద్యం తాగడం వల్ల ఎముకలు బలపడే అవకాశం అయితే ఉంటుంది. మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడంలో మద్యం ఉపయోగపడుతుంది. ఆల్కహాల్ ను ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం నష్టపోక తప్పదు. ఆల్కహాల్ భారీ మొత్తంలో తీసుకుంటే అవయవాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది.