శీతాకాలంలో కాకర కషాయాన్ని సేవిస్తే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమైనట్లే?

కాకరకాయలో మన సంపూర్ణ ఆరోగ్యానికి సరిపడా పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. కావున ప్రతిరోజు కాకరకాయను కర్రీ ,తాలింపు, చిప్స్, జ్యూస్ ఇలా ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మన శరీర పోషణకు అవసరమైన విటమిన్స్ , ఖనిజ లవణాలు,
ఐరన్, మెగ్నీషియం, జింక్, పొటాషియం, కాల్షియం వంటి మూలకాలు పుష్కలంగా లభిస్తాయి. అంతే కాకుండా కాకరకాయలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి సీజనల్ గా వచ్చే
దగ్గు, జలుబు ,గొంతు నొప్పి ,జ్వరం వంటి ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తుంది.

శీతాకాలంలో కాకరకాయను కేవలం కూర రూపంలోనే కాకుండా జ్యూస్ రూపంలో తరచూ తీసుకుంటే ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో వచ్చే ఫ్రీ రాడికల్స్ తో సమర్థవంతంగా పోరాడి అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే
కాకరకాయలో ఉండే హైపోగ్లసమిక్ పదార్ధము రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని నియంత్రించి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.కాకర గింజలలలో చారన్‌టిన్‌ అనే పదార్థం శరీరంలోని మలినాలను తొలగించడమే కాకుండా కాలేయ పనితీరును మెరుగుపరిచి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది

కాకరకాయలో విటమిన్ బి1, విటమిన్ బి2, విటమన్ బి3, థైయమిన్, క్యాల్సియం, బీట కేరొటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండడం వల్ల శరీరంలోని క్యాన్సర్ కారకాలను నశింపజేసి అనేక క్యాన్సర్ల నుంచి మనల్ని కాపాడుతుంది. కాకరకాయలో తక్కువ కెలొరీలూ, ఎక్కువ కార్బొహైడ్రేట్లూ, పీచూ పదార్థం లభిస్తుంది కావున శరీర బరువును నియంత్రించడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. జీర్ణ వ్యవస్థాపన పనితీరును మెరుగుపరిచి మలబద్దక సమస్యను దూరం చేస్తుంది.కాకరకాయలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థను నాడీ వ్యవస్థను మెరుగుపరిచి రక్తపోటు ముప్పును తగ్గిస్తుంది.