నారింజ పండుతో ఇన్ని లాభాల.. రోజుకు ఒక్క పండు తీసుకుంటే ఎంత ఆరోగ్యమో!

నారింజ.. ఈ పండును తలుచుకుంటేనే నోరురిపోతుంది. ఈ పండు అనేక వ్యాధులను నిరోధిస్తుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. నారింజలో 92% విటమిన్ సి లభిస్తుంది. అలాంటి ఈ పండులో ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.

ఆరెంజ్ ని చూడగానే నోటిలో నీళ్లు ఊరుతాయి. ఈ పండును తీసుకుంటే అలసట, టెన్షన్ లు కూడా దూరం అవుతాయి. ఈ పండులో ఎక్కువగా విటమిన్ సి, డి లభిస్తుంది. రోగనిరోధక శక్తి కోసం ఈ పండ్లను ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగాతీసుకుంటున్నారని చెప్పచు. నారింజ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన ప్రతిదీ కలిగి ఉందని చెప్పవచ్చు. ఇందులో విటమిన్ సి, బీ6, క్యాల్షియం, పొటాషియం, సహజ చక్కెర, డైటరీ ఫైబర్, ఫోలేట్ ముఖ్యమైన ఆయిల్స్ , మెగ్నీషియం ,నీరు ఉన్నాయి.

నారింజ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉన్న పండు అని కూడా చెప్పవచ్చు. అందువల్ల నారింజ శరీరానికి తాజాదనాన్ని తీసుకురావడమే కాకుండా అనేక వ్యాధుల బారి నుండి తప్పించుకునేందుకు ఉపయోగపడుతుంది. జ్వరం వచ్చిన వారికి ఆరెంజ్ చేసిన ఇవ్వడం వల్ల బలం చేకూరుతాయి. దాహం నోరు పొడిబారడం వంటి లక్షణాలు పోతాయి. నారింజలో ఉండే కాల్షియం, ఖనిజాలు మన దంతాలకు, ఎముకలకు బలాన్ని ఇస్తాయి.

అంతేకాదు ఈ నారింజ పండుతో కడుపులో గ్యాస్, అజీర్ణం కీళ్ల నొప్పులని నివారిస్తుంది. నారింజ పండ్లలో కొవ్వు ఉండదు. దీనిలో ఉన్న విటమిన్ సి ఫైబర్ ద్వారా బరువు నియంత్రణ చేయవచ్చు. ఇది గర్భవతులకు కూడా చాలా మంచిది అని వైద్యులు అంటారు. నారింజ అండానికి కావలసిన బలాన్ని ఇస్తుందట. అండాన్ని చాలా బలంగా తయారు చేస్తుందట. అలాగే నారింజను అధిక వినియోగం చేయడం వల్ల కొన్ని అప్రయోజనాలు కూడా ఉన్నాయి .అధిక ఫైబర్ వల్ల పొట్ట వ్యవస్థ దెబ్బతింటుంది. పొత్తికడుపులో తిమ్మిరి, ఛాతిలో మంటగా ఉంటుంది. నారింజను అవసరానికి మించి తీసుకోవద్దు అని వైద్యులు సూచిస్తున్నారు.