తుమ్ములు,ఉబ్బసంఇబ్బంది పెడుతున్నాయా…. ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించాల్సిందే!

చలికాలంలో మనల్ని తీవ్రంగా వేధించే జలుబు, దగ్గు, ఉబ్బసం, ఆయాసం, గొంతు నొప్పి, తుమ్ములు వంటి శ్వాస సంబంధిత సమస్యల నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ , యాంటీ వైరల్,యాంటీ సెప్టిక్ గుణాలు సమృద్ధిగా ఉన్న పసుపు దివ్య ఔషధంలా పనిచేస్తుందని మన పెద్దవారు చెబుతుంటారు. పసుపులోని ఔషధ గుణాలు పోషక విలువలు మన సంపూర్ణ ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడతాయని సైంటిఫిక్ గా నిరూపితమైంది. వ్యాధికారకాల తీవ్రత ఎక్కువగా ఉన్న చలికాలంలో మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి పసుపును ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడంతో పాటు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

పాలల్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు చిటికెడు మిరియాల పొడిని కలిపి బాగా మరగనిచ్చిన తర్వాత వడగట్టుకుని గోరువెచ్చని పాలు సేవిస్తే ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు శరీరంలోని వ్యాధికారకాలతో సమర్థవంతంగా పోరాడి సీజనల్గా వచ్చే అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడడమే కాకుండా మనలో ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా ఉపయోగపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ పసుపు పొడి మరియు ఒక టేబుల్ స్పూన్ ఉసరి పొడిని కలిపిన కషాయాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకుంటే జలుబు దగ్గు దగ్గు గొంతు నొప్పి సమస్యలు తగ్గడంతో పాటు రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

పసుపు కొమ్ములు, గోధుమలను సమ పరిమాణంలో తీసుకొని వాటిని చిన్న మంటపై దోరగా వేయించి మిక్సీ జార్లో పొడిగా మార్చుకోవాలి. ఇలా సేకరించిన పొడిని గాజు జార్లో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు భోజనానికి ముందు రెండు స్పూన్ల పసుపు గోధుమ కలిపిన మిశ్రమాన్ని గోరువెచ్చని పాలల్లో కలిపి సేవిస్తే మిమ్మల్ని తీవ్రంగా వేధించి ఉబ్బసం వ్యాధిని నియంత్రణలో ఉంచి ఉపశమనం కలిగిస్తుంది. పసుపులో తేనెను కలిపి ఉదయం సాయంత్రం మూడు నెలల పాటు తీసుకుంటే తీసుకుంటే ఇస్నో ఫీలియో వ్యాధినీ, అదుపులో ఉంచుతుంది.