Seasonal Fruits: వర్షాకాలంలో తినాల్సిన పండ్లు..! సీజనల్ ఇన్ ఫెక్షన్లు దూరం..!!

Seasonal Fruits: ప్రస్తుతం మనం వేసవి కాలం ఎండింగ్ లో ఉన్నట్టు లెక్క. జూలై నుంచి వర్షా కాలంలోకి వెళ్లిపోతున్నాం. వేసవిలో ఎండ వేడి తగలకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో.. వర్షాకాలంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వర్షాకాలంలో చిటపట చినుకుల మధ్య వేడివేడిగా ఏమైనా చిరుతిళ్లు తినాలనిపిస్తుంది. కానీ.. శరీరానికి పోషకాలు అందించే, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం, పండ్లు తినడం ఉత్తమం.

పైగా.. ఇది సీజన్ మారే సమయం కావడంతో జ్వరం, జలుబు, అలర్జీ, ఇన్ ఫెక్షన్, అజీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీటినుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే శరీరానికి శక్తి అవసరం. వ్యాధినిరోధక శక్తి అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో మన ఆరోగ్యానికి ఎంతో అవసరం కూడా. అందుకు తినాల్సిన పండ్ల గురించి తెలుసుకుందాం.

నేరేడు: సీజనల్ గా వర్షాకాలంలో నేరేడు పండ్లు వస్తాయి. వీటిలో కేలరీలు తక్కువ. ఇనుము, ఫోలేట్‌, పొటాషియం, విటమిన్లు ఎక్కువగా ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి చాయిస్. అజీర్తిని తగ్గిస్తాయి కూడా.

చెర్రీస్: వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే పండ్లలో చెర్రీస్ ఒకటి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పండ్లు ఇవి. మెదడుపై ఒత్తిడి తగ్గించి ప్రశాంతత కలిగేలా చేస్తాయి. ఇన్ ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

అరటిపండ్లు: విటమిన్స్ ఎక్కువగా ఉండే అరటిపండు ఎంతో ఆరోగ్యం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్తి సమస్యలను పోగొడుతుంది. పిల్లలకు అరటిపండ్లు చాలా మంచివి. రోజుకో పండైనా తినిపించాలి. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది.

యాపిల్: వర్షాకాలానికి తగ్గట్టు శరీరంలో యాక్టివ్ నెస్ కాస్త నెమ్మదిస్తుంది. దీంతో శరీరంలో జరిగే జీవక్రియ వేగం కూడా తక్కువగా ఉంటుంది. వీటిని అధిగమించేందుకు యాపిల్ పండు ఉత్తమం.

ప్లమ్స్: మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఫ్లూ, జలుబు వంటి ఇన్ ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

దానిమ్మ: ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. రక్తం పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ రోజకొక పండైనా తింటే ఆరోగ్యంగా ఉంటారు.

బొప్పాయి: విటమిన్‌ ‘సి’ అధికంగా లబించే పండు బొప్పాయి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో పీచు పదార్ధం ఎక్కువ. కాస్త మితంగా తీసుకోవడం ఉత్తమం.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.