సామాన్యులకు మరో భారీ షాక్.. బియ్యం ధరలు భారీ స్థాయిలో పెరగనున్నాయా?

మారుతున్న కాలంతో పాటే నిత్యావసర వస్తువుల ధరలు సైతం ఊహించని స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్నా చాలా తక్కువమంది రైతులు మాత్రమే ఈ స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ ను పొందుతున్నారు. అయితే రైతులకు గిట్టుబాటు ధరలు రాకపోయినా నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి.

గతంలో మోదీ సర్కార్ బియ్యం విషయంలో ఎగుమతులపై నిషేధం విధించింది. ప్రస్తుతం దేశంలో తగినంత బియ్యం నిల్వలు ఉండటంతో కేంద్రం బియ్యం ఎగుమతులకు అనుమతులు ఇచ్చిందని తెలుస్తోంది. గతంలో కొంతమంది వ్యాపారులు కృత్తిమ కొరత సృష్టించడం వల్ల కూడా బియ్యం ధరలు భారీగా పెరిగాయనే ఆరోపణలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.

ప్రపంచ దేశాల్లో బియ్యం ఎక్కువగా పండించే దేశాలలో మన దేశం ముందువరసలో ఉంటుంది. మన దేశం నుంచి ఎగుమతులు ఆగిపోవడంతో ఇతర దేశాల్లో బియ్యం ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి. బియ్యం ధరలు పెరిగితే మాత్రం రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

దేశవ్యాప్తంగా బియ్యం వాడకం రోజురోజుకు ఊహించని స్థాయిలో పెరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాస్మతి బియ్యం ధరలలో మాత్రం పెద్దగా మార్పు అయితే ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. కేంద్రం రైతులకు మేలు జరిగేలా మరిన్ని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది.