అన్న ప్రోత్సాహంతో షర్మిల అడుగులేస్తే బెటర్.. లేదంటే షాక్ తప్పదా?

తెలంగాణ రాష్ట్రంలో సత్తా చాటాలని షర్మిల భావిస్తున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. షర్మిల ఇప్పటికే 2,000 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. అయితే షర్మిల పాదయాత్రను అటు రాజకీయ నేతలు కానీ ఇటు ప్రజలు కానీ పెద్దగా పట్టించుకోవడం లేదు. షర్మిల విమర్శలు చేస్తున్నా ఆ విమర్శలకు కూడా మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం గురించి చర్చ జరుగుతోంది.

షర్మిల పొలిటికల్ కెరీర్ విషయంలో సరైన ప్లానింగ్ లేకపోవడం మైనస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. షర్మిల పొలిటికల్ గా జగన్ ప్రోత్సాహంతో ముందడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా జగన్ ను అభిమానించే అభిమానులు ఉన్నారు. జగన్ సంక్షేమ పథకాల గురించి ప్రజలలో మంచి అభిప్రాయాలు నెలకొన్నాయి.

జగన్ పరోక్షంగా షర్మిల పార్టీకి మద్దతు ఇచ్చినా తెలంగాణలో షర్మిల పార్టీ పరిస్థితి మారే అవకాశాలు అయితే ఉంటాయి. అన్న ప్రోత్సాహంతో షర్మిల అడుగులేస్తే బెటర్ అని లేదంటే ఎన్నికల ఫలితాల విషయంలో భారీ షాక్ తప్పదని కామెంట్లు వినిపిస్తున్నాయి. షర్మిల కొత్త పార్టీ పెట్టకుండా తెలంగాణలో వైసీపీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసి ఉంటే బాగుండేది.

షర్మిల పొలిటికల్ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. అలా నిర్ణయాలు తీసుకోని పక్షంలో ఆమె పొలిటికల్ కెరీర్ ఇబ్బందుల్లో పడటం గ్యారంటీ అని చెప్పవచ్చు. షర్మిల పార్టీ 2024 ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం అభ్యర్థులు అయినా దొరుకుతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. షర్మిల 2,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినా ఆ పాదయాత్రకు తగిన ఫలితం దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.