టికెట్ ధరల తగ్గింపు పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రమే అన్నమాట ?

AP government to change movie ticket rates
AP-government-to-change-movటికెట్ ధరల
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే.  అది కూడ సరిగ్గా ‘వకీల్ సాబ్’ సినిమా విడుదలైన కొత్తలో రేట్లు తగ్గిస్తూ అర్థరాత్రి జీవో రిలీజ్ చేశారు.  దీంతో ‘వకీల్ సాబ్’ థియేటర్లు హౌస్ ఫుల్ అయినప్పటికీ వసూళ్లు రాలేదు.  కొన్నిచోట్ల బ్రేక్ ఈవెన్ కూడ కాలేదు.  దీంతో డిస్ట్రుబ్యూటర్లు నష్టాలు చూడాల్సి వచ్చింది.  అభిమానులైతే ప్రభుత్వం పనిగట్టుకుని మరీ పవన్ కళ్యాణ్ మీద కక్ష సాధింపులకి పాల్పడుతోందని మండిపడ్డారు.  సోషల్ మీడియాలో నేతల మీద విరుచుకుపడ్డారు.  నాయకులు కూడ ఊరుకుండలేదు.  పవన్ మీద, అభిమానుల మీద గట్టిగానే రియాక్ట్ అయ్యారు.  ప్రేక్షకుల జేబులకు చిల్లు పడకుండా ఉండటం కోసమే ఈ టికెట్ ధరల తగ్గింపు అని, ఇక మీదట అన్ని సినిమాలకి ఇలానే ఉంటుందని బల్లగుద్ది చెప్పారు. 
 
కానీ ఇప్పుడు మాత్రం థియేటర్ల టికెట్ల ధరలు ఇక రద్దీ ఆధారంగా మారతాయని పేర్కొన్నారు.  వారంతాల్లో టికెట్ ధరలను పెంచుకునే వేసులుబాటుతో పాటు అదనపు షోలో వేసుకునే అవకాశం కూడ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  అంటే టికెట్ రేట్ల విషయంలో థియేటర్ యాజమాన్యాలకు గతంలో ఎలాంటి అవకాశాలు అయితే ఉండేవో అవి మళ్లీ రానున్నాయన్నమాట.  ఒక్క మాటలో చెప్పాలంటే పాత సిట్యుయేషన్ రిపీట్ కానుంది.  దీంతో పవన్ అభిమానులు మరొకసారి ఫైర్ అవుతున్నారు.  టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవడం సంతోషమే అయినా కేవలం పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమాను మాత్రమే టార్గెట్ చేసి ధరలను భారీగా తగ్గించడం సబబు కాదని మండిపడుతున్నారు.