Prickly Heat: వేసవిలో చెమట కాయలు తగ్గేందుకు చిట్కాలు.. ఇవిగో..!!

Prickly Heat: వేసవి కాలం వచ్చిందంటే చెమట, చెమట కాయలు, స్కిన్ రాషెస్, దురద.. ఇలా పలు సమస్యలతో ఇబ్బంది పడతాం. ముఖ్యంగా చెమట కాయలతో వచ్చే దురద చికాకు తెప్పిస్తుంది. చెమటతో ఏర్పడే బ్యాక్టీరియా, డెడ్ స్కిన్ సెల్స్ కలిసి చేమట గ్రంధులని మూసేస్తాయి. దీంతో చెమట చర్మం లోపలే ట్రాప్ అవుతుంది. దీంతో శరీరం లోపలి నుంచి మంట పడుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇదే ప్రిక్లీ హీట్.


దీని నుంచి రిలీఫ్ పొందాలంటే బాడీని కూల్‌గా, చెమట కాయలు ఉన్న చోట బాగా గాలి తగిలేట్లుగా ఉంచుకోవాలి. దీంతో స్కిన్ కి రిలీఫ్ లభిస్తుంది. వేసవిలో తేలికగా, లేత రంగులో ఉండే కాటన్ దుస్తులనే ధరించాలి. కాటన్ దుస్తుల నుంచి గాలీ ఫ్రీగా రొటేట్ అవుతుంది. వేసవి వేడి, ఎండలు శరీరం లోని శక్తిని పీల్చేస్తాయి. అందుకే మంచినీరు, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరినీళ్లు.. తీసుకుంటూ ఉండాలి. ఆల్కహాల్, కలర్ డ్రింక్స్ ను దూరం పెట్టడం మంచిది.

మంచి ఆహారం, సలాడ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. వేపుళ్ళు, మసాలా తగ్గించాలి. స్వీట్స్ ను పక్కన పెట్టేయండి. వేడి వాతావరణం కాబట్టి స్కిన్ ని తడిగా ఉంచడం కంటే పొడిగా ఉంచడం ఉత్తమం. ప్రిక్లీ హీట్ పౌడర్ రాసుకుంటే బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది. చెమటకాయలు ఉన్నచోట చల్లని పెరుగుని అప్లై చేసి పదిహేను నిమిషాలు ఉంచి చల్లని నీటితో కడిగేయాలి. దీంతో యాక్నే రాకుండా చేస్తుంది. స్కిన్ ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది.

200ml రోజ్ వాటర్, నాలుగు టేబుల్ స్పూన్ల తేనె, 200ml వాటర్ కలిపి ఐస్ ట్రే లో పోసి డీఫ్రీజ్ చేయండి. తర్వాత నాలుగైదు క్యూబ్స్ తో పల్చని బట్టలో చుట్టి చెమట కాయలు ఉన్న ప్రదేశం లో అద్దితే ఫలితం వస్తుంది. గంధంలో చల్లని ఫుల్ ఫ్యాట్ మిల్క్ కలిపి చెమటకాయలున్న ప్రదేశం లో రాయాలి. బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగితే శరీరంపై ఉన్న సన్ టాన్ పోతుంది. మూడు టేబుల్ స్పూన్ల ముల్తానీ మిట్టిలో రెండు టీ స్పూన్ల పుదీనా పేస్ట్ కలిపి కొద్దిగా చల్లని పాలు పోసి పేస్ట్ చేయాలి. దీనిని స్కిన్ మీద అప్లై చేసి బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగితే మంచి ప్రయోజనం ఉంటుంది.

గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వైద్యులు, ఆరోగ్య నిపుణులు పలు సందర్భాల్లో వెల్లడించిన అధ్యయనాల ప్రకారమే ఈ వివరాలను అందించాం. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.