కాలంతో సంబంధం లేకుండా చాలామంది దోమల సమస్య వల్ల ఇబ్బందులు పడుతుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దోమల సమస్య తగ్గడం లేదంటూ కొంతమంది చెబుతుంటారు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. దోమల నుంచి కాపాడుకోవడానికి కొంతమంది లిక్విడ్స్, మస్కిటో కాయిల్స్ ను వాడతారు.
అయితే వీటి వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. సాయంత్రం కాగానే తలుపులు, కిటికీలను మూసి ఉంచడం ద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇంట్లో ఎక్కడా చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడటం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
మంచి సువాసన వచ్చే పూల మొక్కలను ఇంట్లో పెంచడం ద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా చేయవచ్చు. లెమన్ గ్రాస్, బంతి, తులసి మొక్కలను ఎవరైతే ఇంట్లో పెంచుతారో వాళ్ల ఇంట్లోకి దోమలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. లవంగాల పొడితో వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి వాటర్ లో ఆ పొడిని కలిపి స్ప్రే చేసినా దోమల నుంచి సులువుగా రక్షించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఇంట్లో కర్పూరంను వెలిగించడం ద్వారా కూడా దోమల సమస్య దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. దోమల నుంచి ప్రమాదకరమైన వ్యాధులు సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఏవైనా వ్యాధులు సోకితే సరైన సమయంలో వైద్య చికిత్స చేయించుకోవాలి. వ్యాధి నిర్ధారణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఇబ్బందులు పడాల్సి ఉంటుందని తెలుస్తోంది.