గ్యాస్ట్రిక్, ఉబ్బసం సమస్యతో బాధపడేవారు ఈ పండ్లను తినొచ్చా.. వైద్యులు ఏమంటున్నారంటే?

ప్రతిరోజు ఒక్క నారింజ పండును ఆహారంగా తీసుకుంటే మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే విటమిన్ సి ని సమృద్ధిగా అందించడంతోపాటు మన శరీర పోషణకు అవసరమైన క్యాల్షియం, ఫైబర్ , పొటాషియం, మెగ్నీషియం,యాంటీ ఆక్సిడెంట్,అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. తరచూ నారింజ పండ్లను లేదా నారింజ జ్యూస్ ను ఆహారంగా తీసుకుంటే తన శరీరాన్ని డిహైడ్రేషన్ సమస్య నుంచి రక్షించి శరీర అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు ఉన్న నారింజ పండ్లను అధిక మొత్తంలో ఆహారంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఒక రోజులు నాలుగు లేదా ఐదు నారింజ పళ్ళను ఆహారంగా తీసుకుంటే వీటిలో అత్యధికంగా ఉండే పొటాషియం కొందరిలో అనారోగ్య సమస్యకు దారితీస్తుంది. పొటాషియం మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పొటాషియం పరిమాణం ఎక్కువైతే హైపర్‌కలేమియా అనే తీవ్రమైన సమస్యకు దారి తీయవచ్చు. అందుకే నారింజ పండ్లను ఎవరైనా తగిన మోతాదులో తీసుకోవడమే మంచిది.

పుల్లని రుచి ఉండే నారింజ పండ్లలో ఆస్కార్బిక్ యాసిడ్ ఆమ్లత గుణాలు ఎక్కువగానే ఉంటాయి. ఇది తగిన మోతాదులు ఉంటే మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. గ్యాస్టిక్, ఉభసం వంటి సమస్యలతో బాధపడేవారు నారింజ పండ్లను ఎక్కువగా తింటే వీటిలో అధికంగా ఉండే ఆమ్లత్వ గుణాలు గ్యాస్టిక్ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. అలాగే నారింజ పండ్లలో మనలో జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ శాతం మన శరీరంలో ఎక్కువైతే అరుగుదల సమస్య ఏర్పడి కడుపునొప్పి, ఉబ్బసం వికారం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తవచ్చు. విటమిన్ సి అధికంగా ఉండే నారింజ పండ్లను మోతాదుకు మించి తీసుకోవడం మంచిది కాదు.