ఈ రోజుల్లో చాలామంది తీవ్రమైన ఒళ్ళు నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు ఒళ్ళు నొప్పుల సమస్య తలెత్తిన వెంటనే నొప్పి నివారణ మందులను ఆశ్రయించకుండా ఒళ్ళు నొప్పుల సమస్య తలెత్తడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే సులువుగా నొప్పి తీవ్రతను తగ్గించుకోవచ్చు.తరచూ ఒళ్ళు నొప్పులు తలెత్తడానికి అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే పోషకాహార లోపం, అధిక ఒత్తిడి నిద్రలేమి సమస్య వల్ల శారీరక, మానసిక అనారోగ్యానికి కారణం అవుతాయి. అధిక ఒత్తిడి కారణంగా మన శరీరంలో జీవక్రియ రేటు తగ్గి శరీర అవయవాలు అలసిపోతాయి. దాంతో మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి నీరసం, అలసట వంటి సమస్యలు తలెత్తి తీవ్ర ఒళ్ళు నొప్పులకు కారణమవుతాయి.ఇలాంటి సందర్భాల్లో కాసేపు విశ్రాంతి తీసుకుంటే నొప్పి సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.
నీళ్లను తక్కువగా తాగే వారిలో కూడా ఒళ్ళు నొప్పుల సమస్య తలెత్తుతుంది కారణం మన శరీరానికి తగినంత నీరు లభించకపోతే డిహైడ్రేషన్ సమస్య తలెత్తి అవయవాల పనితీరులో వ్యత్యాసం ఏర్పడి ఒళ్ళు నొప్పుల సమస్య ఏర్పడుతుంది. కావున దాహం లేకపోయినా తప్పనిసరిగా అప్పుడప్పుడు గ్లాసులు తాగుతూ ఉండాలి. మన శరీరంలో విటమిన్ డి లోపిస్తే తరచూ ఒళ్ళు నొప్పులు సమస్య వేధిస్తుంది. ఇలాంటివారు తరచూ విటమిన్ డి సమృద్ధిగా కలిగిన ఆహార పదార్థాలను తింటూ విటమిన్ డి టాబ్లెట్లను వైద్య సలహా మేరకు వినియోగిస్తే సరిపోతుంది.
ఒళ్ళు నొప్పుల సమస్యకు కారణాలను గ్రహించకుండా విచ్చలవిడిగా డైక్లోఫినాక్ వంటి పెయిన్ కిల్లర్లను అధికంగా వినియోగిస్తే తక్షణం నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు ఏమో కానీ దీర్ఘకాలంలో కిడ్నీ సమస్యలు, ఊబకాయం, రక్తపోటు వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులైన ఆర్థరైటిస్, ఆస్తియోఫోరోసిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధులతో బాధపడేవారిలో ఎక్కువగా కీళ్లనొప్పులు, ఒళ్ళు నొప్పులు సమస్య అధికంగా ఉంటుంది. వీరు తప్పనిసరిగా వైద్య సలహాలు తీసుకొని నొప్పి నివారణ మందులను వినియోగించాల్సి ఉంటుంది.