మిగిలిన ఆటలతో పాటుగా ‘ఆ ఆటని’ కూడా ఎక్కువగా ఆడితే జీవితం ఆరోగ్యమయమేనట!

new england research institute found that thre life span of people increase when they have sex regularly

ఇంగ్లాండ్ లో తాజాగా జరిగిన ఓ అధ్యయనం ప్రకారం.. పడక గదిలో ఆలుమగల కలయిక అనేది ‘జీవితావసరం ’ అంట . దీన్ని కేవలం శారీరక సుఖంగా భావించకూడదట. దీని వల్ల మీలో ఒత్తిడి తగ్గి ఉత్సాహం లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె జబ్బుల నుంచి గట్టెక్కిస్తుంది.ఆరోగ్యం విషయంలో.. డైటింగ్, వ్యాయామం అనేవి ఎప్పుడూ ఒకదాన్ని ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే, అవి మాత్రమే కాకుండా పరిశోధకులు మూడో విషయాన్ని కూడా తెరపైకి తెచ్చారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ డైటింగ్, వ్యాయామం చేయడమే కాకుండా… శారీరకంగా కూడా కలవాలని స్పష్టం చేశారు. దీనివల్ల దీర్ఘకాలిక రోగాలు దరిచేరకుండా జీవిత కాలం పెరుగుతుందట.

new england research institute found that thre life span of people increase when they have sex regularly
new england research institute found that thre life span of people increase when they have sex regularly

22 ఏళ్లపాటు న్యూ ఇంగ్లాండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో నిర్వహించిన పరిశోధనల్లో… ప్రపంచవ్యాప్తంగా గుండె సమస్యలు పెరిగినట్లు తెలిసింది. ఈ అధ్యయనంలో భాగంగా 65 ఏళ్ల లోపు వయస్సు ఉన్న 1,120 మంది పురుషులు, మహిళల జీవనశైలిపై నిఘా ఉంచారు. రోజూ శరీరకంగా కలిసే వ్యక్తుల్లో గుండె సమస్యలు తగ్గడమే కాకుండా ఇతరాత్ర అనారోగ్య సమస్యల లక్షణాలు కూడా తగ్గిపోయాయట. అలాగే అప్పుడప్పుడు కలయికను ఎంజాయ్ చేసేవారిలో సైతం మెరుగైన ఫలితాలు కనిపించాయట.

ఈ పరిశోధనలో… ఒక వారంలో ఒకటి కంటే రెండు సార్లు కలయికలో పాల్గొనేవారిలో హార్ట్ ఎటాక్ ఏర్పడే ముప్పు 27 శాతం కంటే తక్కువగా నమోదైంది. అయితే, అప్పుడప్పుడు మాత్రమే కలయికను ఎంజాయ్ చేసేవారిలో మాత్రం ముప్పు 8 శాతం పెరిగినట్లు గుర్తించారు. అయితే, రోజూ ఆ ‘పని’ చేయడానికి ఇష్టపడని జంటలు.. వారానికి కనీసం ఒక్కసారి చేసినా ఈ ప్రయోజనాలను పొందవచ్చని పరిశోధకులు సూచించారు. ఇలా చేయడం వల్ల ఆయుష్సు 37 శాతానికి పెరుగుతుందట. ఇప్పటికైనా ఇక మీ భయాలు, నమ్మకాలు పక్కనపెట్టి ఆ ఆటలో మునిగి తేలుతూ జీవితాన్ని ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించండి. మీరందరూ… సుఖంగా జీవించాలని ‘తెలుగు రాజ్యం’ టీం కోరుకుంటుంది.