ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్నాయా.. చీమలను తరిమికొట్టే అద్భుత చిట్కాలివే!

ప్రస్తుత కాలంలో ఇంట్లో చీమలు ఉండటం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాలంతో సంబంధం లేకుండా ఈ చీమల సమస్య వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. కారంని నీటిలో కలిపి చీమలు తిరిగే చోట స్ప్రే చేయడం ద్వారా చీమల బారి నుండి తప్పించుకోవచ్చు. కారం పొడి చీమలను కచ్చితంగా దూరం చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం ఆవసరం లేదు.

కర్పూరం, తులసి చీమలను దూరం చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పవచ్చు. కర్పూరాన్ని, తులసి రసాన్ని ఇంటి మూలలలో స్ప్రే చేయడం ద్వారా చీమల సమస్యకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. నీటిలో టీట్రీ ఆయిల్ కలిపి స్ప్రే చేయడం ద్వారా చీమలు చనిపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. యూకలిప్టస్ ఆయిల్ కూడా ప్రత్యేక గుణాలని కలిగి ఉంటుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

యూకలిప్టస్ ఆయిల్, నిమ్మరసాన్ని సమానంగా తీసుకుని అందులో దూదిని ముంచి ఇంటి మూలల్లో ఉంచడం ద్వారా చీమల సమస్య దూరమవుతుంది. వెనిగర్‌ని వాడడం ద్వారా కూడా చీమల సమస్యకు చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఇంటిని క్లీన్ చేసే సమయంలో నీటిలో వెనిగర్ వేసి తుడవడం ద్వారా చీమలు దూరమయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

చీమలు గూడు పెట్టినట్లుగా ఉంటే వేడినీటిని పోయడం ద్వారా చీమలు పారిపోయే అవకాశం ఉంటుంది. మొక్కజొన్న పిండితో చీమల సమస్యకు చెక్ పెట్టవచ్చు. చీమలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో నీళ్లు పోయడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకునే అవకాశం అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు.