ఆయుర్వేద చిట్కాలతో కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టవచ్చు… ఎలాగో తెలుసా?

ప్రకృతి సిద్ధంగా పల్లె పరిసరాల్లో సమృద్ధిగా పెరిగి పల్లె ప్రజలకు సుపరిచితమైన మొక్క అటిక మామిడి తీగ మొక్క.ఈ కలుపు మొక్క సాధారణంగా పొలం గట్లు, రోడ్ల వెంబడి, పచ్చిక మైదానాల్లో ఎక్కువగా పెరుగుతుంది.ఈ మొక్కని కొన్ని ప్రాంతాల్లో అంటుడు కాయ మొక్క అని పిలుస్తుంటారు.ఆయుర్వేద వైద్యంలో అటీక మామిడి తీగ మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది.ఈ మొక్కలోని ఆకులు,కాండం, వేర్లతో సహా ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు నిండి ఉంది కావున ఈ మొక్కను ఆయుర్వేద గ్రంధాల్లో పునర్వవగా పిలవడం జరుగుతోంది.

ప్రకృతి సిద్ధంగా లభించి ఎన్నో ఔషధ గుణాలు ఉన్న అధిక మామిడి తీగ మొక్క ఆకులతో కషాయాన్ని చేసుకొని ప్రతిరోజు సేవిస్తే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందడంతో కిడ్నీ సంబంధిత అన్ని వ్యాధులను సమర్ధవంతంగా నియంత్రిస్తుంది. అటిక మామిడి తీగ మొక్కతో రుచికరమైన ఫ్రై, కర్రీస్ వంటివి కూడా చేసుకొని తినవచ్చు. అటిక మామిడి కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మొదట అటిక మామిడి మొక్కలోని ఆకులు, పువ్వులు, వేర్లతో సహా సన్నని ముక్కలుగా తరిగి ఐదు లేదా పది నిమిషాలు 200 మి.లీ. నీటిలో మరిగించాలి. బాగా మరిగిన తర్వాత వడగట్టుకుని రసాన్ని మాత్రమే తీసుకొని ప్రతి రోజు ఉదయం పరగడపున 50 మి.లీ కషాయాన్ని తాగితే ఒంట్లో వ్యాధికారకాలని తొలగించబడతాయి. ముఖ్యంగా
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు అటిక మామిడి తీగ కషాయాన్ని ప్రతిరోజు పరగడపున 50 మి.లీ సేవిస్తే అటిక మామిడి తీగ మొక్క దివ్య ఔషధంలా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడినా, కిడ్నీలు పాడైపోయిన డయాలసిస్ వరకు వచ్చిన వారి ప్రాణాలను సైతం అటిక మామిడి రసంతో రక్షించవచ్చనని పురాతన ఆయుర్వేద వైద్యం చెబుతోంది