పొట్టలో ఉన్న కొవ్వు కరగాలి అంటే ఈ పొడినీ ట్రై చేస్తే చాలు…కొవ్వు మొత్తం కరిగినట్టే!

ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల ఆహార శైలిలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ ఉరుకుల పరుగుల కాలంతో పాటు చాలా పోషకాహారానికి బదులుగా ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే బరువు పెరగడమే కాకుండా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి అది తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకోవడానికి డైలీ నడవడం లాంటివి చేస్తున్నారు. అయినప్పటికీ చాలామందికి రిజల్ట్ రావడం లేదు. ఈ నేపథ్యంలోనే చాలామంది మెడికల్ పరంగా వైద్యులు కూడా సంప్రదిస్తున్నారు.అయితే మన పొట్టలో పేరుకుపోయిన కొవ్వు తగ్గాలంటే ఈ చిట్కా ప్రయత్నిస్తే చాలు.

మరి అలాంటి వారికోసం మన ఇంట్లో దొరికే వాటితోనే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ఏ విధంగా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం తీసుకోబోయే చిట్కాను పాటిస్తే మీ బెల్లీ ఫ్యాట్ తగ్గడమే కాకుండా శరీరం ఆరోగ్యంగా ఫిట్ గా కూడా ఉంటుంది. డైలీ ఉదయాన్నే ఈ పొడిని వారం రోజుల పాటు తీసుకోవడం వల్ల మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అదేవిధంగా హెల్దీగా కూడా ఉంటారు. మరి ఆ పొడినీ ఎలా తయారు చేయాలి అందుకు కావాల్సిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.. జీలకర్ర, నువ్వులు, దాల్చిన చెక్క, కలోంజీ సీడ్స్. ఈ కలోంజీ సీడ్స్ అనేవి మార్కెట్ లో బాగా దొరుకుతాయి.

ఈ నాలుగు పదార్థాలను సమాన పరిమాణంలో తీసుకుని విడివిడిగా వేయించాలి. ఇక అనంతరం నాలుగు పదార్థాలు దోరగా వేయించిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా పొడి తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న ఆ పొడి దాదాపు రెండు నెలల వరకూ నిల్వ ఉంటుంది. అర టీ స్పూన్ పొడిలో తేనె కలిపి ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజూ తీసుకోవడం వల్ల క్రమంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగి మంచి శరీరాకృతిని కలిగిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యానికి మరియు అవయవాల పనితీరుకి కూడా ఈ పొడి బాగా సహాయపడుతుంది.