పుదీనాలో ఉన్న ఔషధ గుణాలు మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్తున్నారు. తరచూ పుదీనా ఆకులను వివిధ రకాల కూరల్లో, పచ్చళ్లలో చక్కటి రుచి ,సువాసన కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
ముఖ్యంగా చర్మ ఇన్ఫెక్షన్లు,అలర్జీల సమస్య ఎక్కువగా ఉండే చలికాలంలో యాంటీ బాక్టీరియల్,యాంటీ ఫంగల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న పుదీనా ఆకులను ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటూనే అదనంగా పుదీనా ఆకుల రసాన్ని సేవిస్తే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంతో పాటు అనేక చర్మ సమస్యలను సహజ పద్ధతిలో తొలగించుకోవచ్చు.
ముఖ్యంగా చలికాలంలో చర్మంపై వచ్చే అనేక అలర్జీలను నియంత్రించడంలో పుదీనాలోని ఔషధ గుణాలు దివ్య ఔషధంలా పనిచేస్తాయి.ఇందుకోసం పుదీనా ఆకులను మెత్తటి మిశ్రమంగా చేసుకుని ముఖంపై ఫేస్ ప్యాక్ గా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే పుదీనా ఆకుల్లో ఉండే సహజ గుణాలు ఆస్ట్రిజెంట్‌గా పనిచేసి
శ్వేత గ్రంథంలో ఉన్న వ్యాధికారక క్రిములను తొలగించి చర్మాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. చలికాలంలో చర్మం పొడి మారడాన్ని నివారించే చర్మంపై మచ్చలను, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది
పుదీనా ఆకులలో ఉన్న సహజ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ సెప్టిక్ లక్షణాలు చర్మం పై వచ్చే నల్ల మచ్చలు, దద్దుర్లు తగ్గించడంలో సహాయపడుతాయి. జిడ్డు చర్మ సమస్యతో బాధపడేవారు పుదీనా ఆకుల రసాన్ని ఒక అబ్బాయి మర్దన చేసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే పుదీనా ఆకులలో సాలిసిలిక్ యాసిడ్ చర్మంలో ఆయిల్ ఉత్పత్తిని తగ్గించి చర్మానికి సహజ మెరుపుని ఇస్తుంది. జిడ్డు ద్వారా వచ్చే మొటిమల, మచ్చలు ముడతలు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. కళ్ళ కింద నల్లని వలయాల సమస్యతో బాధపడేవారు పుదినాకుల రసాన్ని రాత్రి పడుకునేటప్పుడు కళ్ళకింద రాసుకొని ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే నల్లటి వలయాలు తొలగిపోతాయి.