ఉబకాయ శరీరంతో బాధపడేవారు చెరుకు రసాన్ని సేవిస్తే మంచిదా..!

సాధారణంగా చేరుకు రసాన్ని అత్యంత వేడిగా ఉండే ఎండకాలం సీజన్లో మాత్రమే తాగడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. అలా కాకుండా చెరుకు రసాన్ని తరచూ అన్ని సీజన్లో నిక్షేపంగా తీసుకోవచ్చు చెరుకు రసంలో మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్,క్యాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ ఫైబర్ వంటి పోషక విలువలు సమృద్ధిగా లభించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. అలాగే చెరుకు రసంలో ఉండే గ్లూకోస్ను శరీరం తొందరగా గ్రహించి తక్షణ శక్తిని ఇవ్వడంతో మనలో శారీరక అలసట, నీరసం వంటి సమస్యలు తొలగిపోతాయి. కావున అధిక పని ఒత్తిడి, శారీరక శ్రమ కలిగిన వారు రోజువారి ఆహారంలో ఒక గ్లాస్ చెరుకు రసాన్ని సేవిస్తే చాలా ఉపయోగకరం.

తరచూ డిహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారు చెరుకు రసాన్ని సేవిస్తే మన శరీరానికి అవసరమైన నీటి నిల్వలు అందించి శరీరాన్ని ఎప్పుడు హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్దీకరించి వడదెబ్బ సమస్య నుంచి కూడా రక్షిస్తుంది. అత్యంత ఆల్కలైన్ స్వభావం కలిగిన చెరుకు రసాన్ని తరచూ సేవిస్తే రొమ్ము క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ఉదర క్యాన్సర్ కారకాలను నియంత్రించడంలో చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, మెగ్నీషియం నాడీ కణాలను ఉత్తేజపరిచి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

చెరుకు రసంలో క్యాలరీలు తక్కువగా ఉండి పోషక విలువలు ఎక్కువగా లభ్యమవుతాయి కావున ఉబకాయ సమస్యతో బాధపడేవారు తరచూ సేవిస్తే సులువుగా ఉబకాయ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించడంలో సహాయపడి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. చెరుకు రసంలో సమృద్ధిగా లభించే కాల్షియం, పొటాషియం ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడి వృద్ధాప్యంలో వచ్చే ఎముక సంబంధిత రుగ్మతలను నియంత్రిస్తుంది. పొటాషియం రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.