ఉబకాయం,డయాబెటిస్ వేధిస్తోందా ? చియా గింజలే చక్కటి పరిష్కారం.. ఎలాగో తెలుసా?

ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న డయాబెటిస్,
ఉబకాయం,అధిక శరీర బరువు సమస్యతో బాధపడే వారికి చియా విత్తనాలు చక్కటి పరిష్కార మార్గం చూపుతాయి. న్యూట్రిషన్ నిపుణులు భరోసా ఇస్తున్నారు. చియా విత్తనాలలో ఒమేగా3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు,కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటాయి. కావున ప్రతిరోజు 28 నుండి 38 గ్రాముల చియా విత్తనాలను ఉదయాన్నే ఆహారంగా తీసుకుంటే ఇందులో సహజ అమైనో ఆమ్లాలు శరీరంలో నిల్వ ఉండే చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి.తద్వారా సహజ పద్ధతిలో తొందరగా శరీర బరువును నియంత్రించుకోవచ్చు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు చియా విత్తనాలను ఆహారంలో తీసుకున్నట్లయితే వీటిలో అధికంగా ఉన్న ఫైబర్ రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి చక్కర వ్యాధిని అదుపు చేయడంలో సహాయపడుతుంది. చియా విత్తనాల్లో పుష్కలంగా ఉన్నాయి మెగ్నీషియం , జింకు, విటమిన్ బి3 నాడీ కణాల అభివృద్ధిలో సహాయపడి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్ వ్యాధిని అదుపు చేయడంలో సహాయపడుతుంది. చియా గింజల్లో సమృద్ధిగా లభించే డెంటరి ఫైబర్ తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేసి పేగు కదలికలను మెరుగుపరచడంతోపాటు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

చియా గింజలను ప్రతిరోజు ఆహారంగా తీసుకుంటే వీటిలో లభించే సహజ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి క్యాల్షియం ఫాస్ఫరస్ వంటివి ఎముకలు కండరాల దృఢత్వానికి తోడ్పడి వృద్ధాప్యంలో వచ్చే కండర క్షీణత ఎముక బోలు వ్యాధి ముప్పును తగ్గిస్తుంది. రోజంతా శారీరకంగా, మానసికంగా అలసిపోయిన వారు సాయంత్రం కొన్ని సబ్జా గింజలను నానబెట్టుకుని తింటే ఇందులో ఉండే ఔషధ గుణాలు మెదడులోని మెలనిన్ హార్మోన్స్ ఉత్పత్తిలో సహాయపడి సుఖప్రదమైన నిద్రను కలిగించి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.