ప్రతిరోజు శరీరానికి తగినన్ని మంచినీళ్లను తాగడం ఆరోగ్యానికి మంచిది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మంచినీళ్లను తాగే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు నియమాలు పాటిస్తే మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చు. మంచినీళ్లు తాగే విషయంలో జాగ్రత్తలు ఏంటి అనుకుంటున్నారా . తప్పదు. అసలు రోజుకు మనం ఎన్ని లీటర్ల నీటిని తాగాలి, ఎప్పుడు తాగాలి ,ఎలా తాగాలి వంటి విషయాల గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ ఆయుర్వేద వైద్యంలో కూడా నీటిని తాగే విషయంలో కొన్ని నియమాలు పేర్కొనడం జరిగింది.
ఆయుర్వేద వైద్యులు సూచనల ప్రకారం ఒక మనిషి రోజుకు నాలుగు లీటర్ల నీటిని తాగాలి. ఎక్కువ నీళ్లను ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా తాగితే మన ఆరోగ్యానికి మంచిదని పేర్కొన్నారు.ఆధునిక వైద్యులు ఒక వ్యక్తి రోజుకు మూడు లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలని చెబుతున్నారు.ఎప్పుడు దాహమైతే అప్పుడే మంచినీళ్లు తాగాలి. అది కూడా ఒక గ్లాసు మంచి నీళ్లు తీసుకోవడం మంచిది. ఇలాంటి నియమాలు పాటించడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యలు, అజీర్తి, మలబద్ధకం, అర్షమొలలు, గాల్‌బ్లాడర్,వంటి అనేక సమస్యలను దూరం పెట్టవచ్చు.
మనం తాగే మంచినీళ్ల ఎక్కువ చల్లగా ఉన్న, ఎక్కువ వేడిగా ఉన్న మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు వాతావరణ పరిస్థితులు బట్టి గోరు వెచ్చగా ఉండే నీళ్లు తాగడం మంచిది.ప్రతిరోజు భోజనానికి అరగంట ముందు, అరగంట తరువాత మాత్రమే మంచినీరు తాగాలి. భోజనం చేసిన వెంటనే ఎక్కువ నీరు తాగడం వల్ల జీర్ణరసాలు వడి తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వక అజీర్తి, గ్యాస్టిక్, వాంతులు వంటి సమస్యలు ఏర్పడవచ్చు.
మన శరీరానికి అవసరమైనంత మాత్రమే నీళ్లు తాగాలి ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత మంచిది అనుకుని మరీ ఎక్కువగ తాగడం మంచిది కాదు.మనం ఎక్కువ నీటిని తాగడం వల్ల నీటిని బయటికి పంపే క్రమంలో కిడ్నీలపై భారం పడుతుంది.ప్రతి రోజు వ్యాయామం చేసే వాళ్ళు వ్యాయామానికి ముందు, వ్యాయామం తరువాత గ్లాసు నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది.