కరోనా రెండవ బూస్టర్ డోస్ వేయించుకోవడం అవసరమా..? వైద్య నిపుణులు ఏమంటున్నారంటే?

గత మూడు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి సృష్టించిన భయాందోళనలు ప్రపంచ దేశాల ప్రజలు మరవకముందే మరోసారి వైరస్ రూపాంతరం చెంది కొత్త వేరియంట్స్ తో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కలవరపాడుకు గురిచేస్తుంది. ఇప్పటికే చైనా అమెరికా బ్రిటన్ వంటి దేశాల్లో కరోనా కొత్త వేరియంట్స్ తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందడంతో ప్రపంచ దేశాల అధిపతులు కరోనా కట్టడికి తీవ్రమైన ఆంక్షలు విధించాలని నిర్ణయించుకున్నారు.

కరోనా ఫోర్త్ వేవ్ తప్పదంటూ సంకేతాలు వస్తుండడంతో మన భారత ప్రభుత్వం అప్రమత్తమై అంతర్జాతీయ విమానాశ్రయాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దేశంలో కరోనా కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తూ. దేశంలో కొవిడ్‌ వ్యాప్తిని పరిశీలిస్తోంది. కొవిడ్‌ టెస్టులు, క్వారంటైన్‌ సదుపాయాలు, వ్యాక్సిన్‌ మొదలుకొని ఆసుపత్రుల్లో చేయాల్సిన ఏర్పాట్లపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తోంది.

కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా 90 శాతం జనాభాకు కరోనా వ్యాక్సిన్ తో పాటు బూస్టర్ దోస్ కూడా ఇవ్వడం జరిగింది. తాజా పరిణామాల దృశ్య రెండవ కరోనా బూస్టర్ డోస్ తీసుకోవాల్సి వస్తుందేమో అన్న సందేహం చాలా మందిలో తలెత్తుతుంది. వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం దేశంలో కరోనా వైరస్ వ్యాప్త 0.09 శాతంగా ఉంది.ప్రస్తుతం రెండవ కోవిడ్-19 బూస్టర్ డోస్ అవసరం లేదు, ముందుగా మనం దేశంలో మొదటి బూస్టర్ డ్రైవ్‌ను పూర్తి చేయాలి.రెండవ బూస్టర్ డోస్ గురించి ఇమ్యునైజేషన్ ప్యానెల్ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ లో కూడా ఎటువంటి చర్చ ప్రారంభించబడలేదు. దేశంలో మొదటి బూస్టర్ డ్రైవ్‌ను పూర్తి చేయడమే ప్రధమ కర్తవ్యం అంటూ అధికార వర్గాల నుంచి సంకేతాలు వస్తున్నాయి.