మనలో చాలామంది నీళ్లను వేడి చేయడానికి వాటర్ హీటర్ ను ఉపయోగిస్తూ ఉంటారు. చలికాలంలో, వర్షాకాలంలో వేడినీటితో స్నానం చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. అయితే వాటర్ హీటర్ తో వేడి చేసిన నీళ్లను స్నానానికి వాడటం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వాటర్ హీటర్ వాటర్ కొన్నిసార్లు చర్మ సంబంధిత సమస్యలకు కారణమవుతుంది.
గుండెపై కూడా కొంతమేర వాటర్ హీటర్ వాటర్ ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉంటాయి. అదే సమయంలో వాటర్ హీటర్లను వినియోగిస్తూ ప్రాణాలను కోల్పోతున్న వాళ్ల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. వాటర్ హీటర్ రాడ్‌తో నీటిని వేడి చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. నీటి ఉష్ణోగ్రతను చెక్ చేయడానికి స్విచ్ ఆఫ్ చేసి చెక్ చేస్తే మంచిది.
స్విచ్ ఆఫ్ చేసిన వాటర్ హీటర్ ను పిల్లలకు దూరంగా ఉంచాలి. ఇనుము లేదా స్టీల్ బకెట్‌లో నీటిని ఎప్పుడూ వేడి చేయకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నీటిని వేడి చేయడానికి ప్లాస్టిక్ బకెట్లను ఉపయోగించడం మంచిది. వాటర్ హీటింగ్ రాడ్ ఉపయోగించినప్పుడు.. నీటిలోకి ఎంత పంపాలో దానిపై ఉండే గుర్తు సహాయంతో సులభంగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.
ఏ మాత్రం నాణ్యత లేని వాటర్ హీట్లను వినియోగించడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. పాత వాటర్ హీటర్లను వాడటం మంచిది కాదు. ఐ.ఎస్.ఐ మార్క్ ఉన్న వాటర్ హీటర్ ను మాత్రమే వినియోగించాలి. వాటర్ హీటర్ కు సంబంధించిన వైర్ కట్ అయ్యి ఉంటే మాత్రం అలాంటి వాటర్ హీటర్లకు దూరంగా ఉంటే మంచిది.